English   

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే

NTR-trivikram
2018-05-19 11:57:54

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని బ్యానర్ పై రూపొందుతోన్న సినిమా టైటిల్ వచ్చేసింది. రేపు ఎన్టీఆర్ బర్త్డ సందర్భంగా ఇవాళే టైటిల్ విడుదల చేస్తామని ముందేచెప్పింది టీమ్. అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. టైటిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా.. ‘‘అరవింద సమేతా రాఘవ’’. కాస్త వెరైటీగా ఉంది కదూ. ఇదే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా టైటిల్. 

మామూలుగానే త్రివిక్రమ్ టైటిల్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి. అయితే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో సినిమా చేస్తున్నాడు కాబట్టి టైటిల్స్ లో ఏమైనా మార్పులుంటాయోమో అనుకున్నారు. బట్.. అలాంటివేం లేవని ఈ టైటిల్ చూస్తే తెలుస్తుంది. అలాగే టైటిల్ తోనే కథ కూడా ఇన్ డైరక్ట్ గా చెప్పినట్టు తెలుస్తుంది. అరవింద పూజా హెగ్డే అని ఎన్టీఆర్ పేరు రాఘవ అనేది అర్థమౌతూనే ఉంది. ఒక రకంగా సీతా సమేత రాములవారు అనీ, పద్మావతి సమేత శ్రీనివాసుడు అని సమేత అనేది దేవుళ్లకు వాడుతుంటారు. అలాంటిది అది తన సినిమా టైటిల్ గా పెట్టేశాడంట ఈ సినిమా కథ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే విషయం చెప్పకనే చెప్పినట్టు అనుకోవచ్చు. ఏదేమైనా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇంత సాఫ్ట్ టైటిల్ పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. మొత్తానికి సాయంత్రం వరకూ ఈ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నారు. మరి ఈ టైటిల్ కు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 

More Related Stories