English   

ఎన్టీఆర్ విలన్, చరణ్ పోలీస్

ntr villon role in rajamouli nxt movie
2018-06-02 20:01:50

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పటి నుంచీ ఈ ప్రాజెక్ట్ వార్తల్లోనే ఉంటోంది. ఇదుగో కథ అంటే అదుగో క్యారెక్టర్ అంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్త.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని.. రామ్ చరణ్ పోలీస్ గా కనిపిస్తాడని. యస్.. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. మరి ఇందులో నిజమెంతో కానీ.. నిజమైతే బావుండు అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఈ రెండు పాత్రల్లో ఆ ఇద్దరికీ అద్భుతమైన నటన చూపించే అవకాశం వస్తుంది. అందుకే ఈ వార్త నిజం కావాలనుకునే వారే ఎక్కువగా ఉన్నారు. 

జై లవకుశలో ఎన్టీఆర్ ఆల్రెడీ రావణ్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. అలాంటిది ఇక రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో అయితే ఎలా ఉంటుంది. ఆ పాత్ర ఖచ్చితంగా పీక్స్ లో ఉంటుంది. ఇక రంగస్థలంతో అద్భుత నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్ కూడా పోలీస్ గా దుమ్మురేపే చాన్స్ ఉంది. అయితే ఈ కథ గురించి కొన్ని రూమర్స్ కూడా లేకపోలేదు. బాలీవుడ్ లో వచ్చిన కరణ్ జోహార్ కథనే కాస్త మెరుగులు దిద్ది తెలుగుకు అనుగుణంగా మారుస్తున్నారనేదే ఆ రూమర్. ఇది నిజమా కాదా అనేది తెలియదు కానీ.. ఈ ప్రాజెక్ట్ పై వీటితో అయిపోలేదు. ఇంకా రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న క్రేజ్ అటువంటిది మరి. 

More Related Stories