English   

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య..?

NTR-Balakrishna
2018-04-14 07:49:09

ఇది కదా మజా అంటే.. ఇది కదా పోటీ అంటే.. ఇప్పుడు కదా ఎవరి సత్తా ఏంటో తేలేది..  బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్.. ఈ మాట వినడానికే ఓ రేంజ్ లో ఉంది. ఇక నిజంగానే వీరి మధ్య రీల్ ఫైట్ జరిగితే ఇంక చెప్పేదేముందీ.. ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ఈ బాబాయ్ అబ్బాయ్ ల మధ్య గొడవ పెట్టేది ఎవరో తెలుసా..? దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తేజ. యస్.. ఈ ఇద్దరు ఇప్పుడు ఎన్టీఆర్, బాలయ్యతో సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలూ అఫీషియల్ గా ప్రారంభం అయ్యాయి. బాలయ్య తండ్రి బయోపిక్ ను తెరకెక్కిస్తూ తనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీనికి తేజ దర్శకుడు. ఈ మూవీలో చాలామంది ఆర్టిస్టులు ఉండబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ లాగే బాలయ్య కూడా చాలా గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. దాదాపు బాలయ్య 50కి పైగా గెటప్పుల్లో కనిపిస్తాడని టాక్. అయితే ఆ మధ్య ప్రారంభం అయిన ఎన్టీఆర్ బయోపిక్ ను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఇంత పెద్ద సెటప్ ఉండే సినిమాను అంత షార్ట్ టైమ్ లో ఫినిష్ చేసి దసరాకు విడుదల చేయడం సాధ్యమా అని చాలామంది అనుకున్నా.. బాలయ్య మత్రం తేజకు స్ట్రాంగ్ గా చెప్పాడు. దసరాకే విడుదల చేయాలని. అందుకే అతను వెంకటేష్  సినిమాను కూడా వదులుకున్నాడు. సో.. ఎన్టీఆర్ గా బాలయ్య దసరాకు రావడం దాదాపు ఖాయం.  ఇక ఇవాళ అఫీషియల్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కూడా దసరాకే విడుదల కాబోతోంది. యస్.. చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అనే పోటీ జరగబోతోంది. ఇది జరుగుతుందా లేదా అనేది తెలియదు కానీ.. జరిగితే మాత్రం ఎవరూ వెనక్కి తగ్గుతారు అనేదే అసలు పాయింట్. అయితే మరోవైపు బాలయ్య, తేజ సినిమా అయితే ప్రారంభించారు.. కానీ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అందుకే ఇది దసరాకు వస్తుందా అనేది డౌటే. ఒకవేళ అన్నీ సెట్ చేసుకుని వచ్చినా ఆశ్చర్యం లేదు. వస్తే మాత్రం బాక్సాఫీస్ నందమూరి వార్ తో షేక్ అవుతుందనేది మాత్రం ఖాయం. 

More Related Stories