English   

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..వ‌చ్చే వార‌మే ప్రోమో

NTRs MEK promo
2021-02-27 18:26:07

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై అల‌రించ‌బోతున్నాడ‌ని కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం త్వ‌ర‌లోనే నిజం కాబోతుంది. ఎన్టీఆర్ ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ వ‌న్ కు హోస్ట్‌గా చేసి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్ప‌టినీ బిగ్ బాస్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ అయితే భాగుంటుంద‌ని బిగ్‌బాస్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ కాదుగానీ ఈసారి ఎన్టీఆర్ మీలో ఎవ‌రు కోటీష్వ‌రుడు షోతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి వ‌స్తున్నాడు. అయితే ఇదివ‌ర‌కు మాటీవీలో వ‌చ్చిన ఈ ప్రోగ్రాం ఇక‌పై మాత్రం జెమిని టీవీలో రాబోతుంది. అంతేకాకుండా ప్రోగ్రాం పేరును ఎవ‌రు మీలో కోటీష్వ‌రుడు పేరుతో తీసుకువ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఈ షోకు సంబందించిన ప్రోమోను కూడా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. 

ఈ ప్రోమోను మాట‌ల మాత్రికుడు త్రివిక్ర‌మ్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో చిత్రించారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ప్రోమో వ‌చ్చే వారం నుండే ప్రసారం కానుంది. అంతే కాకుండా ప్రోగ్రాంను వచ్చే నెల‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను బుల్లితెర‌పై చూసేందుకు ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. దాంతో త్వ‌ర‌లోనే వారి కోరిక నెర‌వేర‌బోతుంది. ఇదిలా ఉండగా మీలో ఎవ‌రు కోటీష్వ‌రుడు షోను 2014 ప్రారంభించారు. మొద‌టి రెండు సీజ‌న్ల‌కు నాగార్జున హోస్ట్ గా చేసారు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఈ షోను 2019లో ప్రాంరంభించగా చింర‌జీవి హోస్ట్‌గా చేసారు. ఇక రాబోయే అయిదో సీజ‌న్‌లో ఎన్టీఆర్ రాబోతున్నారు. 

More Related Stories