English   

ఏం చెప్పాలి ఆఫీస‌ర్.. దారుణం..!

officer disastrous openings
2018-06-04 06:21:56

మ‌నం ఫ్లాప్ సినిమాలు చూసుంటాం.. డిజాస్ట‌ర్స్ ను కూడా చూసుంటాం.. కానీ ఎపిక్ డిజాస్ట‌ర్స్ ఉంటాయి కొన్ని వాటిని మాత్రం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు వ‌ర్మ‌-నాగార్జున పుణ్య‌మా అని దాన్ని చూసే అదృష్టం క‌లిగింది మ‌న‌కు. కొన్నేళ్లుగా ఇలాంటి చెత్త సినిమా ఏదీ రాలేదు అన్న‌ట్లు ఆఫీస‌ర్ వ‌చ్చింది. స్టార్ హీరో ఉండి కూడా తొలిరోజు క‌నీసం కోటి రూపాయ‌లు కాదు క‌దా.. అందులో స‌గం 50 ల‌క్ష‌లు కూడా వ‌సూలు చేయ‌లేని దారుణ‌మైన స్థితిలో ఓ సినిమా రావ‌డం నిజంగానే షాక్ ఇచ్చే విష‌యం. ఇప్పుడు ఆఫీస‌ర్ అన్ని అద్భుతాలు చేస్తుంది. తొలిరోజు ఈ చిత్రానికి 45 ల‌క్ష‌ల ఓపెనింగ్ వ‌చ్చింది. దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియ‌క ట్రేడ్ పండితులు కొత్త పేరు క‌నిబెడుతున్నారు. వ‌ర్మ ఇప్పుడు ఫామ్ లో లేడ‌ని తెలుసు కానీ అత‌డి సినిమా వ‌స్తే ప్రేక్ష‌కులు మరీ ఇంత‌గా భ‌య‌ప‌డుతున్నార‌ని మాత్రం ఇప్పుడే అర్థ‌మ‌వుతుంది. 

లేక‌పోతే మ‌రేంటి నాగార్జున లాంటి స్టార్ ఉండి కూడా క‌నీసం కోటి రూపాయ‌లు వ‌సూలు చేయ‌లేదంటే ఏం అనుకోవాలి..? మ‌ళ్లీ దీనికి 400 స్క్రీన్స్ ఇచ్చారు. మార్నింగ్ షోకే ప్రేక్ష‌కులు తిట్టుకుంటూ బ‌య‌టికి వ‌చ్చేస్తున్నారు. ఇక మ‌ధ్యాహ్నానికి ఎవ‌డు వ‌స్తాడు..? మ‌రోవైపు అభిమ‌న్యుడు బాగానే ఆడుతుండ‌టంతో బాయ్ ఆఫీస‌ర్ అంటూ నాగార్జున ముందే విశాల్ కు హాయ్ చెబుతున్నారు. ఈ తీరు చూస్తుంటే క‌నీసం కోటి రూపాయ‌ల షేర్ కూడా వ‌సూలు చేయ‌లేని అద్భుత‌మైన క‌ళాఖండంగా నాగార్జున కెరీర్ లో ఆఫీస‌ర్ నిలిచిపోతుందేమో..? అయినా ఏం చేస్తాంలెండి.. తెలిసి చేసిన త‌ప్పు క‌దా.. నాగార్జున‌కు కూడా త‌ను ఎంత పెద్ద త‌ప్పు చేసానో ఇప్పుడు అర్థ‌మైపోయుంటుంది. అర్థ‌మైనా ఇప్పుడు పెద్ద‌గా ఉప‌యోగం లేదు.. ఎందుకంటే జ‌ర‌గాల్సిన న‌ష్టం ఆల్రెడీ జ‌రిపోయింది కాబ‌ట్టి..! 

More Related Stories