English   

బాబోయ్ రవితేజ్ మార్కెట్

ravi teja
2018-02-18 11:49:50

మాస్ మహరాజ్ రవితేజ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. లాస్ట్ మూవీ టచ్ చేసి చూడు డిజాస్టర్ అయినా అతని మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే నెక్ట్స్ రాబోయే సినిమాతో అతను కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ జరగబోతోంది. ఆశ్చర్యం ఏంటంటే.. అసలు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కానీ ఎంటైర్ ఇండస్ట్రీ షాక్ అయ్యే రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. ఒక రకంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి. రవితేజ మార్కెట్ పడిపోయి చాలాకాలం అయింది. రాజా ద గ్రేట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ టచ్ చేసి చూడుతో పాట ఫ్లాప్ టచ్చింగ్ ఇచ్చాడు. అయినా ఇప్పుడు కళ్యాణ్ కృష్ణతో చేస్తోన్న సినిమా బిజినెస్ ట్రేడ్ ను సర్ ప్రైజ్ చేస్తోంది.

మాస్ రాజా రవితేజ ఇప్పుడు సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుకచూద్దాం ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే యాభైశాతంకు పైగా షూటింగ్ పూర్తయినట్టు చెబుతున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి ‘నేల టికెట్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టేశారు. ఫైనల్ గా ఇదే టైటిల్ తో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ మూవీకి నిర్మాత రామ్ తాళ్లూరి. అయితే ఇంకా యాభై శాతం ప్రొడక్షన్ వర్క్ ఉండగానే ఈ మూవీకి 25కోట్ల బిజినెస్ పూర్తయింది. శాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ రూపంలోనే ఈ మొత్తం వచ్చేసిందట. రవితేజ సినిమాకు హిందీ డబ్బింగ్ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే శాటిలైట్ విషయంలో డైరెక్టర్ ప్రీవియస్ సినిమాల ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యుండొచ్చు. ఇక డిజిటల్ రైట్స్ కూడా ఇప్పుడు మంచి రేట్ కోట్ అవుతున్నాయి. దీంతో రవితేజ సినిమాకు ఆల్రెడీ పెట్టుబడి వచ్చేసినట్టే అనుకోవచ్చు. ఇక థియేట్రికల్ రైట్స్ వేరే ఉన్నాయి. అవి కూడా ఎంత లేదన్నా మరో పాతిక కోట్లకు అమ్ముడుపోతాయి. అంటే రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మార్కెట్ జరగబోతున్నట్టు అనుకోవచ్చు. సో.. రవితేజ పని ఐపోయిందనుకున్నవాళ్లు ఇప్పుడేం కామెంటుతారో చూడాలి.

More Related Stories