English   

ఆగ‌స్ట్ 11, 2017.. ఆ మూడింటికి ఏడాది..!

Rana-Nithiin

స‌రిగ్గా ఏడాది కింద ఈ టైమ్ లో అంద‌రూ ఏం జ‌రుగుతుందా అని ఆస‌క్తిగా చూస్తున్నారు. దానికి కార‌ణం ఒకేరోజు మూడు సినిమాలు విడుద‌ల కావ‌డం.. అవ‌న్నీ పేరున్న పెద్ద సినిమాలు కావ‌డం. గ‌త కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో ఒకేరోజు మూడు క్రేజీ సినిమాలు రావ‌డం మాత్రం చూడ‌లేదు. ఒక్క రోజు గ్యాప్ లో.. రెండు రోజుల గ్యాప్ లో వ‌చ్చాయి కానీ ఒకేరోజు మాత్రం రాలేదు. కానీ స‌రిగ్గా ఏడాది కింద ఆ విచిత్రం జ‌రిగింది. ఆగ‌స్ట్ 11.. 2017న మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి.

అవే జ‌య జాన‌కి నాయ‌కా.. నేనేరాజు నేనేమంత్రి.. లై. బెల్లంకొండ శ్రీ‌నివాస్.. రానా.. నితిన్ లాంటి క్రేజీ హీరోలు ఒకేరోజు వ‌చ్చారు. చివ‌రివ‌ర‌కు ఎవ‌రో ఒక‌రు పోటీ నుంచి త‌ప్పుకుంటారేమో అనుకున్నా.. అంతా ఒకేరోజు వ‌చ్చారు. ఇప్పుడు ఈ మూడు సినిమాల‌కు ఒకేరోజుతో ఏడాది పూర్త‌యింది. నేనేరాజు నేనేమంత్రి 24 కోట్లు వ‌సూలు చేసి సూప‌ర్ హిట్ అనిపించుకోగా.. బోయ‌పాటి శీను జ‌య జాన‌కీ నాయ‌కా 25 కోట్లు వ‌సూలు చేసినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.

ఇక నితిన్ లై పూర్తిగా రేస్ నుంచి త‌ప్పు కుని డిజాస్ట‌ర్ అనిపించుకుంది. అయితే మూడు సినిమాల‌కు టాక్ బాగానే రావ‌డం మాత్రం విశేషం. ఎన్నేళ్లైనా ఆగ‌స్ట్ 11, 2017కు మాత్రం ఈ ప్ర‌త్యేక‌థ ఉంటుంది. ఒకేరోజు మూడు సినిమాలు రావ‌డం నిజంగా అరుదైన విష‌య‌మే కదా. ఈ సినిమాల ఫ‌లితాలు చూసిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ అలాంటి ధైర్యం ఏ నిర్మాత చేయ‌లేదు.. చేయ‌లేడు కూడా..!

More Related Stories