English   

రోబో 2కు అస‌లైన స‌వాల్ బాహుబ‌లి..

Baahubali Robo Challenge
2017-05-01 06:48:32

ఇండియాలో ఇప్పుడు రెండే రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒక‌టి రోబో.. మ‌రొక‌టి బాహుబ‌లి. ఇప్ప‌టికే బాహుబ‌లి 2 విడుద‌లైంది. తొలిరోజే 121 కోట్లు వ‌సూలు చేసి.. తన రేంజ్ ఏంటో చూపించింది. మూడు రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. దీని దూకుడు చూస్తుంటే ఈజీగా 1000 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్పుడు బాహుబ‌లి 2.. రోబో 2కు స‌వాల్ విసురుతుంది. ద‌క్షిణాది సినిమా స‌త్తాను రాజ‌మౌళి కంటే ముందే బాలీవుడ్ కు చూపించిన ద‌ర్శ‌కుడు శంక‌ర్. ఇలాంటి ద‌ర్శ‌కుడు ఇప్పుడు రోబో 2 తెర‌కెక్కిస్తున్నాడు. పైగా ర‌జినీకాంత్ ఇందులో హీరో.

దాంతో ఇప్పుడు రోబో 2 రికార్డుల‌పై అందరి మ‌న‌సు వెళ్తోంది. బాహుబ‌లి స్థాయిలో ర‌జినీ రికార్డులు తిర‌గ‌రాస్తాడా అనే ఆస‌క్తి మొద‌లైందిప్పుడు. క‌బాలి లాంటి యావ‌రేజ్ సినిమాతోనే 300 కోట్లు వ‌సూలు చేసాడు ర‌జినీకాంత్. అది కేవ‌లం సూప‌ర్ స్టార్ స్టామినా మాత్ర‌మే. ఇప్పుడు ఈయ‌న‌కు తోడుగా శంక‌ర్ ఉన్నాడు. ఇద్ద‌రూ క‌లిస్తే రికార్డులు తిర‌గ‌రాయ‌డం పెద్ద మ్యాట‌రేం కాదు. 2018 జ‌న‌వ‌రి 25న రోబో 2 విడుద‌ల కానుంది. ఈ సినిమా వ‌సూళ్లపై క‌చ్చితంగా బాహుబ‌లి 2 ప్ర‌భావం ఉంటుంది. ఆ సినిమాను బీట్ చేస్తే గానీ ర‌జినీ రేంజ్ ఏంటో ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు. చూడాలిక‌.. బాహుబ‌లి రికార్డులు తిర‌గ‌రాసే ఆ ద‌మ్ము ర‌జినీలో ఉందో లేదో..?

More Related Stories