English   

ఏడిపించిన పాట వ‌చ్చేసిందిగా..!

Orayyo-song

రంగ‌స్థ‌లం చూసిన వాళ్లెవ్వ‌రైనా ఆ పాటను మ‌రిచిపోరు. ఒక్క‌సారి ఆ పాట విన్నారంటే క‌ళ్ల‌లో ఒక్క‌సారైనా నీళ్లు రాకుండా ఉండ‌వు. ఎంత ఏడుపు కంట్రోల్ చేసుకున్నా క‌నీసం క‌ళ్లు చెమ‌ర్చ‌క అయితే మాన‌వు. ఓ పాట‌లోనే అంత ఎమోష‌న్ ఉంటుందా అనేంత‌గా సుకుమార్ ఆ పాట సినిమాలో చిత్రీక‌రించాడు. రంగ‌స్థ‌లంలో మిగిలిన ఐదు పాట‌లు ఒకెత్తైతే.. క‌చ్చితంగా ఆరోపాట మాత్రం మ‌రో ఎత్తు. ఎందుకంటే సినిమా క‌థ అంతా ఆ పాట‌లో చెప్పాడు ద‌ర్శ‌కుడు సుకుమార్.. రాసాడు చంద్ర‌బోస్. దాన్ని అంతే హృద్యంగా పాడాడు చంద్ర‌బోస్. చాలా రోజుల త‌ర్వాత ఈయ‌న మైక్ అందుకు న్నాడు. కానీ ఆ పాట‌తో అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు. అదే ఓర‌య్యో.. నా అయ్యా. ఈ సేతితోనే లాల పోసాను.. ఈ సేతితోనే బువ్వ పెట్టాను.. ఈ సేతితోనే పాలు ప‌ట్టాను అంటూ సాగే ఈ పాట క‌చ్చితంగా మ‌న‌సును క‌దిలించ‌డం ఖాయం. 

ఇంట్లో పెద్ద కొడుకు చ‌నిపోతే వాళ్లు ప‌డే బాధ ఎలా ఉంటుంది.. ఎవ‌రు ఓదారుస్తారు వాళ్ల‌ను.. అనే కోణంలో రాసిన ఈ పాట థియేట‌ర్స్ లోనే ప్ర‌తీ ఒక్క‌రిని క‌న్నీరు పెట్టిస్తుంది. అంత రియ‌లిస్టిక్ గా ఈ పాట‌ను చిత్రీక‌రించాడు సుకుమార్. ఇక ఆది కూడా ఈ సీన్ లో చేసిన యాక్టింగ్ అద్భుత‌మే. శ‌వంలా ఆయ‌న ఒక్క షాట్ లో కూడా ఊపిరి తీసుకు న్న‌ట్లుగా కూడా అనిపించ‌దు. ఇక రోహిణి.. న‌రేష్.. చ‌రణ్.. స‌మంత‌ల న‌ట‌న అయితే మ‌రో స్థాయిలో ఉంటుంది. ఇంత ఆర్ద్ర‌త‌తో ఉన్న ఈ పాట‌ను ముందు విడుద‌ల చేయ‌లేదు. ఇప్పుడు ఆ పాట‌ను విడుద‌ల చేసారు. ఈ ఒక్క పాట‌తో రంగ‌స్థ‌లం రేంజ్ మ‌రో స్థాయికి వెళ్లిపోయింది. మొత్తానికి ఈ పాట‌ను ఇప్పుడు ప్రేక్ష‌కులు కూడా విని ఎంజాయ్ చేయండి అన‌కూడ‌దేమో.. ఎమోష‌న్ ను ఫీల్ అవ్వండ‌నాలి. 

More Related Stories