English   

ఆస్కార్.. అదుర్స్ .. 

oscars- 2018- winners

90వ అకాడమీ అవార్డుల వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా మేటి నటులందరూ తరలివచ్చారు. ఎందరో హీరోయిన్లు రెడ్ కార్పెట్ పై హొయలు పోయారు.. మొదట బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డును త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరి మూవీకి శామ్ రాక్‌వెల్ అందుకున్నారు.  ఆస్కార్ బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ విభాగంలో డార్కెస్ట్ అవర్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇక ఫాంటమ్ థ్రెడ్ మూవీకి తరఫున బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ పురస్కారాన్ని మార్క్ రిజెస్ అందుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ పీచర్‌గా ఇకరస్ మూవీ అకాడమీ అవార్డు అందుకుంది. బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో డన్‌క్రిక్‌ మూవీకి ఆస్కార్ పురస్కారాలు దక్కాయి. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ద షేప్ ఆఫ్ వాటర్ మూవీకి ఆస్కార్ లభించింది.  ఈసారీ ఆస్కార్ బరిలో ది షేప్ ఆఫ్ వాటర్ మూవీ అత్యధికంగా 13 విభాగాల్లో వామినేషన్ దక్కించుకుంది. ఆ తర్వాత త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరి సినిమా 9 విభాగాల్లో, డన్‌క్రిక్‌ 7 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకున్నాయి. ఈ మూడు సినిమాలు  ఉత్తమ చిత్రం కేటగిరీలో కూడా ఉన్నాయి. మిగిలిన వాటిలో ‘కాల్‌ మి బై యువర్‌ నేమ్‌’, ‘డార్కెస్ట్‌ అవర్‌’, ‘గెట్‌ అవుట్‌’, ‘ది ఫాంటమ్‌ థ్రెడ్‌’, ‘ది పోస్ట్‌’ మూవీస్ ఉన్నాయి చిత్రాలు ఉన్నాయి.

ఉత్తమ దర్శకుల విభాగంలో ఐదుగురు పోటీపడ్డారు. ఫాంటమ్ థ్రెడ్ దర్శకుడు పాల్ థాస్ ఆండ్రసన్‌, ది షేప్ ఆఫ్ వాటర్, లేడీబర్డ్, గెటవుట్ సినిమా దర్శకులు బరిలో ఉన్నారు. డ్రంకిక్ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్‌ ఈసారీ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ఈసారీ అకాడమీ వేడుకల్లో ఉత్తమ నటుడి విభాగంలో తిమోటీ చాల్మెంట్ కాల్ మి బై యువర్ నేమ్ మూవీ కోసం పోటీపడగా.. గ్యారీ ఓల్డ్ మాన్ డార్కెస్ట్ అవర్ కోసం ఆస్కార్ బరిలో నిలిచారు. వీరితోపాటూ ఫాంటమ్ థ్రెడ్ హీరో డానియల్ డే ల్యూనిస్, గెటవుట్ హీరో డానియల్ కాలూయా, డెన్జిల్ వాషింగ్టన్ బెస్ట్ యాక్టర్ పురస్కారం అందుకోడానికి పోటీపడ్డారు. 

ఇక ఉత్తమనటి ఆస్కార్ కోసం ది షేప్ ఆఫ్ వాటర్ , త్రీ బిల్ బోర్డ్స్, ఐటోన్యా, లేడీబర్డ్ హీరోయిన్లు ఉన్నారు. వీరితోపాటూ ది పోస్ట్ సినిమాలో నటించిన మెర్లీ స్ట్రీప్ కూడా ఆస్కార్  అందుకోడానికి పోటీపడ్డారు.. ఆస్కార్  2017 ఉత్తమ నటి అవార్డు విజేత ఎమ్మా స్టోన్ 'ఆస్కార్ 2018 ఉత్తమ దర్శకుడు' పురస్కారాన్ని గిలెర్మో డెల్ టోరోకు ప్రదానం చేశారు. టోరోకు ఇదే తొలి ఆస్కార్ పురస్కారం. ఈ సందర్భంగా టోరో మాట్లాడుతూ తాను ఓ వలసదారుడినని, కళ చేసే మహోన్నత కార్యక్రమం ఏమిటంటే, సరిహద్దులను చెరిపేయడమేనని అన్నారు.

90వ అకాడమీ అవార్డుల ప్రదానం.. లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో ఘనంగా వేడుక..

ఉత్తమ చిత్రం: 'ది షేప్ ఆఫ్ వాటర్' 
ఉత్తమ దర్శకుడు: గిల్లెర్మో డెల్ టోరో .. 'ది షేప్ ఆఫ్ వాటర్
బెస్ట్ యాక్టర్    -  గారీ ఓల్డ్‌మన్‌ (డార్కెస్ట్ అవర్)
బెస్ట్ యాక్ట్రెస్- ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్‌.. (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్ మిసోరీ) 
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- శామ్ రాక్‌వెల్ ( త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌‌ సైడ్‌ ఎబ్బింగ్‌ మిస్సోరి)
బెస్ట్ స్క్రీన్ ప్లే అడాప్టింగ్   - కాల్ మి బై యువర్ నేమ్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్   - ద షేప్ ఆఫ్ వాటర్
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ - డార్కెస్ట్ అవర్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - ఫాంటమ్ త్రెడ్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ - ఇకరస్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ - డన్‌క్రిక్‌
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - డన్‌క్రిక్‌
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - ది షేప్ ఆఫ్ వాటర్
ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్  - ఫెంటాస్టిక్ ఉమన్ (చిలీ)

More Related Stories