English   

OTT వైపు పడుతున్న చిన్న సినిమాల అడుగులు..

ott
2020-05-01 07:43:28

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మరో మూడు నాలుగు నెలల వరకు థియేటర్లు ఓపెన్ చేయడం అనేది కల లాగే కనిపిస్తుంది. కరోనా వైరస్ దెబ్బ స్పష్టంగా మరో మూడు నాలుగు నెలల వరకు దేశంలో ఉండటం ఖాయం. అందుకే ఇప్పట్లో సినిమాలు విడుదల చేయడం అనే మాట మర్చిపోవాలి నిర్మాతలు. అందుకే ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి కొన్ని సినిమాలు. ముఖ్యంగా చిన్న సినిమాలకు దీనికి మించిన ప్లాట్ ఫామ్ మరొకటి దొరకడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీలో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత దొరకడం కూడా కష్టమే. ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటన్నింటినీ కాదని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం ఎగ్జిబిటర్ లకు తలకు మించిన భారమే..

అయినా అది జరగని పని. ఒకవేళ జరిగినా థియేటర్లకు ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి వస్తారు అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. అందుకే మరో ఆలోచన లేకుండా చాలా మంది చిన్న నిర్మాతలు తమ సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ పద్ధతిలో విడుదలైన అమృతరామమ్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా మరీ స్లోగా ఉంది అంటూ తీసి పారేశారు ప్రేక్షకులు. అయితే కొన్ని చిన్న సినిమాలు మాత్రం మంచి విషయంతో వస్తుంటాయి. అలాంటి వాటికి డిజిటల్ ప్లాట్ ఫామ్ తోడైతే కచ్చితంగా మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఇలా థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ లో విడుదల చేయడం మంచి పద్ధతి కాదు అంటున్నారు థియేటర్ల యాజమాన్యం. ఇలా చేస్తే డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోతారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

 

More Related Stories