English   

OTTలో సురేష్ ప్రొడక్షన్స్ సినిమా.. సంచలనాలకు తెర..?

krishna
2020-05-02 20:32:58

లాక్ డౌన్ కారణంగా చిన్న సినిమాలకు విడుదల కష్టాలు మొదలయ్యాయి. పెద్ద సినిమాలు అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాకపోతే రేపైనా విడుదల చేసుకుంటారు. కరోనా వైరస్ పోయిన తర్వాత హాయిగా వస్తారు కానీ చిన్న సినిమాలకు అలా కాదు. మామూలు సమయంలోనే వీటిని ఎవరూ పట్టించుకోరు.. బాగుంది అంటే తప్ప థియేటర్స్ కు రారు ప్రేక్షకులు. అలాంటిదిప్పుడు కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న ఈ సమయంలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా కచ్చితంగా ఆడియన్స్ అయితే రారు. అందుకే చిన్న సినిమాలు వరసగా ఓటిటిలో విడుదల చేస్తున్నారు. మొన్నటికి మొన్న అమృత రామమ్ అలాగే విడుదలైంది. ఇప్పుడు మరో సినిమా కూడా వస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌లో గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు హీరోగా కృష్ణ అండ్ హిస్ లీల అనే సినిమాను చాలా రోజుల కిందే పూర్తి చేసారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాను క్షణం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత నాలుగేళ్ళకు పైగా వేచి చూసి ఈ చిత్రం చేసాడు రవికాంత్. ఈ సినిమాకు సిద్ధూ కూడా కథ అందించాడు. టైటిల్ కు తగ్గట్లే సినిమాలో చాలా రొమాన్స్ ఉందని అర్థమైపోతుంది. ఒక రొమాంటిక్ కుర్రాడి కథను చెప్తున్నాడు రవికాంత్. అమ్మాయిని చూస్తే టెంప్ట్ అయిపోవడం ఫ్లర్ట్ చేయడం.. రిలేషన్షిప్ మొదలుపెట్టడం.. అది ముగిశాక ఇంకో అమ్మాయిని తగులుకోవడం.. ఇదీ ఈ సినిమాలో హీరో గారి పని. తనకున్న ఈ బలహీనత గురించి హీరోనే నరేట్ చేసుకుంటూ సాగే టీజర్ కూడా బాగానే ఉంది. ఈ సినిమాలో జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ తో పాటు షాలిని వడ్నికట్టి.. సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంయుక్తంగా నిర్మించాయి. గతేడాది ఆగష్టులోనే షూటింగ్ ముగించుకున్న సినిమా ఇంతవరకు విడుదల కాలేదు.. తాజాగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇదే కానీ జరిగితే సురేష్ బాబు దీనికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది.

More Related Stories