English   

OTTలో కూడా ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది..

ott
2020-05-03 08:17:28

లాక్‌డౌన్ ఎవరికైనా బాగా యూజ్ అయిందా అంటే అది ఓటిటి ప్లాట్ ఫామ్స్‌కే. ఎందుకంటే అంతకు ముందు కూడా వీటికి డిమాండ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అవే నిత్యావసర వస్తువుల్లా మారిపోయాయి. ఎందుకంటే బోర్ కొడితే బయటికి వెళ్లడం.. టైమ్ పాస్ కాకపోతే థియేటర్స్ కు వెళ్లే ఆప్షన్ లేదిప్పుడు. అందుకే అంతా ఇంట్లోనే ఉండి ఓటిటిల్లో వచ్చిన సినిమాలను చూస్తున్నారు. అందుకే వాళ్లు కూడా అదిరిపోయేలా సినిమాలు సిద్ధం చేస్తున్నారు. కొందరు నిర్మాతలు కూడా తమ సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ సినిమా 'Mrs.సీరియల్ కిల్లర్' కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. గత వారం విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హ్యాపీ ఫేమ్ మనోజ్ బాజ్‌పెయి, శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రానికి చెత్త రేటింగ్స్ ఇచ్చారు ఆడియన్స్. ఇంట్లో కూర్చుని కూడా ఈ చిత్రాన్ని చూడలేం బాబోయ్ అంటున్నారు. గతంలో అక్షయ్ కుమార్ తో జోకర్ లాంటి దారుణమైన డిజాస్టర్ తీసిన దర్శకుడు శిరీష్ కుందర్ దీన్ని కూడా తెరకెక్కించాడు.

అయితే రెండోసారి కూడా ఆయన ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఓటిటిలో విడుదల చేస్తే ఎలా ఉన్నా కూడా ఆడియన్స్ చూస్తారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ దర్శక నిర్మాతల్లో కనిపిస్తుంది కానీ ఫ్రీగా వచ్చినా కూడా అలాంటి సినిమాలు మేం చూడమని ప్రేక్షకులు మాత్రం నేరుగానే అర్థమయ్యేలా చెప్తున్నారు. దీనికి మిసెస్ సీరియల్ కిల్లర్ మాత్రమే కాదు.. గతంలో ఎమ్మెస్ ధోనీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'డ్రైవ్' కూడా ఉదాహరణే. ఈ చిత్రం కూడా ఎప్పుడొచ్చి వెళ్లిందో తెలియదు. అందుకే ఓటిటి అంటే ఎగేసుకుని పడిపోరు.. మంచి సినిమాలు అయితే ఇక్కడా ఆదరణ ఉంటుంది.

More Related Stories