English   

OTT సినిమాలను థియేటర్లో దించారు.. దెబ్బ పడింది..

Power Play Gaali Sampath
2021-03-13 13:43:37

తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరోనా వైరస్ రాకముందు వచ్చిన తర్వాత అని రెండు భాగాలుగా విభజించాలి. కరోనా వైరస్ రాకముందు ముందు ఏ సినిమా చేసినా కూడా థియేటర్లలో విడుదల చేయడం తప్ప నిర్మాతకు మరో ఆప్షన్ ఉండేది కాదు. నేరుగా డిజిటల్ రిలీజ్ చేయడం అప్పటికి తెలుగు సినిమాకు తెలియదు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. నిర్మాతలకు కొత్త కొత్త ఆప్షన్స్ పుట్టుకొచ్చాయి. చాలా రోజులుగా రిలీజ్ కి నోచుకోని ఎన్నో సినిమాలు ఓటీటీ వేదికగా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొందరు దర్శకులు డిజిటల్ ప్లాట్ ఫాం దృష్టిలో పెట్టుకొని అలాంటి కథలు మాత్రమే తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకులను దారుణంగా నిరాశ పరిచాయి. 

దానికి కారణం అందులో ఓటీటీ కంటెంట్ ఉండడం. ఈ సినిమాలను డిజిటల్ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ముందుగా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎంచుకున్న కథలు కూడా అలాగే ఉన్నాయి. అవి థియేటర్లకు సరిపోవు అని వాళ్లకు కూడా తెలుసు. అయినా కూడా ఒక రాయి వేద్దాంలే అని థియేటర్స్ లో విడుదల చేశారు. కానీ విడుదలైన తొలిరోజే వీటి భవిష్యత్తు ఏంటో తేలిపోయింది. ఆ రెండు సినిమాలు రాజ్ తరుణ్ పవర్ ప్లే, అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన గాలి సంపత్. నిజానికి రాజ్ తరుణ్ గత సినిమాలతో పోలిస్తే పవర్ ప్లే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే థియేటర్లలో విడుదల చేసిన కారణంగా ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. ఇప్పుడు విడుదలైన గాలి సంపత్ కూడా థియేటర్ కంటెంట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా నటించిన కూడా థియేటర్లో అంతసేపు ఈ కంటెంట్ భరించడం కాస్త కష్టం. నేరుగా ఓటీటీలో విడుదలై ఉంటే ఈ రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చి ఉండేది అంటున్నారు విశ్లేషకులు. కానీ థియేటర్లో విడుదల కారణంగా అటూ ఇటూ కాకుండా పోయాయి.

More Related Stories