English   

ఓటీటీ ఆఫర్స్ కు టెంప్ట్ అవుతున్న కుర్ర హీరోలు

Nani vijay devarakonda
2020-07-11 13:04:00

కరోనా దెబ్బకు జనాలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యాక ఓటీటీ లకి డిమాండ్ బాగా పెరిగింది. ఓటీటీలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరగడంతో పాటు భారీ వ్యూయర్ షిప్ కూడా పెరిగిందని అంటున్నారు. దీంతో స్టార్ యాక్టర్స్ ని వెబ్ కి పరిచయం చేసి క్రేజ్ తెచ్చుకోవాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఒకదానికి మించి మరోటి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో కొంతమంది నటీనటులకు ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేసి వారిని వెబ్ సిరీస్ లలో నటింపజేస్తున్నారు. దీతో ఓటీటీలు ఇప్పుడు ఇతర సినీ ఇండస్ట్రీల మీద ఫోకస్ పెట్టాయని అంటున్నారు. 

బాలీవుడ్ తరువాత అంత మార్కెట్ ఉన్న టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన ఓటీటీలు దానిలో భాగంగా ఇక్కడ కొంత మంది కుర్ర హీరోలకు గాలం వేస్తునాయని అంటున్నారు. పెద్ద హీరోలు ఎటూ మాట వినరు కాబట్టి యువ హీరోలకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయని అంటున్నారు. ఓటీటీలు ఇచ్చే ఇంత భారీ ఆఫర్స్ కి కుర్ర హీరోలు 'నో' చెప్పలేకపోతున్నారని అంటున్నారు. అయితే యంగ్ హీరోలు ఈ ఓటీటీలతో నటించడం కాక కలిసి ప్రొడక్షన్ లోకి దిగాలని ట్రై చేస్తున్నారని అంటున్నారు. నాని,విజయ్ దేవరకొండ,నాగ శౌర్య లాంటి హీరోలు ఆ విధంగా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories