English   

ఓవర్సీస్ టాప్ తెలుగు సినిమాలు.. అల వైకుంఠపురములో లేటెస్ట్ ఎంట్రీ..

cinema
2020-01-21 19:13:59

తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు ఓవర్సీస్ అంటే ఏదో బోనస్ అనుకునేవాళ్లు కానీ కొన్నేళ్లుగా అక్కడ మన సినిమాలు బాలీవుడ్‌ను కూడా బీట్ చేస్తున్నాయి. తెలుగు సినిమా రేంజ్ చూసి బాలీవుడ్ కూడా బిత్తరపోయే స్థాయికి ఎదిగాయి మన సినిమాలు. తాజాగా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మరోసారి యుఎస్ బాక్సాఫీస్ దద్ధరిల్లిపోయింది. ఓవర్సీస్‌లో 2 మిలియన్ దాటిన సినిమాలు ఒక్కసారి చూద్దాం..

1. బాహుబలి 2: ఎన్ని సినిమాలు వచ్చినా కూడా బాహుబలి 2 మాత్రం ఎప్పుడూ పైనే ఉంటుంది. 2017లో విడుదలైన ఈ చిత్రం 21 మిలియన్ వసూలు చేసింది.
2. బాహుబలి: బాహుబలి ది బిగినింగ్ కూడా చాలా సంచలనాలు రేపింది. ఈ చిత్రం కూడా 2015లోనే 8.46 మిలియన్ వసూలు చేసింది.
3. రంగస్థలం: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. అప్పటి వరకు ఒక్క 2 మిలియన్ మార్క్ సినిమా కూడా లేని రామ్ చరణ్.. రంగస్థలంతో ఏకంగా 3.5 మిలియన్ అందుకున్నాడు.
4. భరత్ అనే నేను: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ భరత్ అనే నేనుకు ఓవర్సీస్ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రం అక్కడ 3.4 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.
5. అల వైకుంఠపురములో: తాజాగా టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. సాహో పేరు మీదున్న 3.2 మిలియన్ రికార్డును దాటేసి టాప్ 3 వైపుగా వెళ్తున్నాడు బన్నీ. ఇంకా వసూళ్లు బాగా వస్తుండటంతో రంగస్థలంకు ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్.
6. సాహో: 3.23 మిలియన్ వసూళ్లతో ప్రభాస్ మూడో 3 మిలియన్ మార్క్ అందుకున్నాడు. బాహుబలితో ఈయన తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.
7. శ్రీమంతుడు: 2015లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు రికార్డుల వర్షం కురిపించింది. ఓవర్సీస్‌లో అప్పటి వరకు ఉన్న రికార్డులు చెరిపేసి 2.89 మిలియన్ వసూలు చేసింది ఈ చిత్రం.
8. సైరా నరసింహారెడ్డి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ పీరియాడికల్ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా కూడా ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం 2.83 మిలియన్ వసూలు చేసింది.
9. మహానటి: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా మహానటి. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం యుఎస్ మార్కెట్ లో 2.54 మిలియన్ వసూలు చేసింది.
10. గీత గోవిందం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గీత గోవిందం. పరుశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2.46 మిలియన్ వసూలు చేసి టాప్ 10లో చోటు దక్కించుకుంది.
11. అ..ఆ: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఎప్పుడూ ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. నితిన్ హీరోగా వచ్చిన అ..ఆ సినిమా మూడేళ్ల కిందే 2.445 మిలియన్ డాలర్స్ వసూలు చేసి రికార్దులు తిరగరాసింది.
12. ఖైదీ నెం 150: చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150 కూడా ఓవర్సీస్‌లో రచ్చ చేసింది. ఈ చిత్రం 2.43 మిలియన్ వసూలు చేసింది.
13. సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబుకు మూడో 2 మిలియన్ క్లబ్ సినిమా ఇది. ఇప్పటి వరకు 2.1 మిలియన్ వసూలు చేసింది ఈ చిత్రం. ఫుల్ రన్ ముగిసేసరికి 2.5 మిలియన్ క్లబ్బులో చేరే అవకాశం ఉంది.
14. అరవింద సమేత: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ అరవింద్ సమేత ఓవర్సీస్ ఆడియన్స్ కు బాగానే నచ్చింది. ఈ చిత్రం అక్కడ 2.18 మిలియన్ వసూలు చేసింది.
15. ఎఫ్2: వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫన్ ఎంటర్ టైనర్ ఎఫ్2. 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఓవర్సీస్ లో 2.12 మిలియన్ వసూళ్లు సాధించింది.
16. ఫిదా: వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పక్కా విలేజ్ డ్రామా ఫిదా. సాయి పల్లవి పుణ్యమా అని ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఏకంగా 2.067 మిలియన్ వసూలు చేసింది.
17. అజ్ఞాతవాసి: పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా కూడా కేవలం ప్రీమియర్స్ తోనే అప్పట్లో 1.7 మిలియన్ వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఫుల్ రన్‌లో ఈ చిత్రం 2.065 మిలియన్ వసూలు చేసింది.
18. నాన్నకు ప్రేమతో: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో ఇండియాలో యావరేజ్ అయినా కూడా ఓవర్సీస్ లో మాత్రం బ్లాక్ బస్టర్. ఈ చిత్రం అక్కడ 2.04 మిలియన్ డాలర్స్ వసూళ్లు తీసుకొచ్చింది.

More Related Stories