English   

ఇలా చూస్తుంటే ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. 

padi padi leche manasu
2018-07-14 16:18:20

అవును.. నిజంగానే ఇప్పుడు ఇదే అనాల‌నిపిస్తుంది. ఈ జోడిని ఇలా చూస్తుంటే ఎంత అందంగా ఉందో మ‌రి..! ఇద్ద‌రూ న్యాచుర‌ల్ యాక్ట‌ర్సే. పైగా మంచి విష‌యం ఉన్న ద‌ర్శ‌కుడి చేతుల్లో ప‌డ్డారు. దాంతో ఇక న‌ట‌న ఎలా ఉంటుందో.. వాళ్ల కెమిస్ట్రీ ఎలా ఉండ‌బోతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి ప‌డి ప‌డి లేచే మ‌న‌సు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈ మ‌ధ్యే కోల్ క‌త్తాలో 70 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నేపాల్ వెళ్తున్నారు. అక్క‌డే చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతుంది. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు శ‌ర్వానంద్. దానికితోడు రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఒక‌టి 40 ప్ల‌స్ రోల్ అని వార్త‌లొస్తున్నాయి. ఈ పాత్ర కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు శ‌ర్వానంద్. దానికితోడు ఇందులో మెమోరీ లాస్ పేషెంట్ గా శ‌ర్వా క‌నిపిస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా ఈ చిత్రంలోని కొన్ని లుక్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. 


కోల్ క‌త్తా బ్రిడ్జ్ పై సాయి, శ‌ర్వా ఉన్న పిక్ బాగా ఆక‌ట్టుకుంటుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తాను ఒప్పుకోన‌ని చెప్పిన సాయిప‌ల్ల‌వి.. హ‌ను చెప్పిన క‌థ‌కు ప‌డిపోయి ఈ సినిమా చేస్తుంది. దాన్ని బ‌ట్టి ఇందులో హీరోయిన్ పాత్ర‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. జులైలోనే షూటింగ్ పూర్తి కానుంది. ఎంసిఏలో సాయిప‌ల్ల‌వి పాత్ర‌ను క‌ట్ చేసార‌ని వ‌స్తున్న నేప‌థ్యంలో శ‌ర్వా సినిమాలో మాత్రం పూర్తిగా ప‌ల్ల‌వి పాత్రే సినిమాకు హైలైట్ అవుతుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా హ‌ను త‌న సినిమాల్లో హీరోయిన్ల‌కు మంచి పాత్ర‌లే ఇచ్చాడు. లై మిన‌హాయిస్తే అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథల్లో హీరోయిన్ల పాత్ర‌ల‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మొత్తానికి చూడాలిక‌.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు ఎలా ఉండ‌బోతుందో.. నిజంగానే ఈ సినిమా ప‌డి ప‌డి లేస్తుందో లేదంటే ఒకేసారి పైకి బాగా లే

స్తుందో చూడాలిక‌..

More Related Stories