English   

సాయిప‌ల్ల‌వి కోసం ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. 

Padi-Padi-Leche-Manasu

అవును.. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి కోసం త‌న మ‌న‌సు ప‌డిప‌డి లేస్తుంది అంటున్నాడు శ‌ర్వానంద్. ఈ కుర్ర హీరో ఇప్పుడు ప‌ల్ల‌వి మాయ‌లో ప‌డి పోయాడు. వీళ్లిద్ద‌రూ క‌లిసి ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే క‌ల‌క‌త్తాలో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు శ‌ర్వానంద్. దానికితోడు రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఒక‌టి 40 ప్ల‌స్ రోల్ అని వార్త‌లొస్తున్నాయి. ఈ పాత్ర కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు శ‌ర్వానంద్. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. దీనికి ప‌డిప‌డి లేచే మ‌న‌సు టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. మార్చ్ 6న శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టైటిల్ విడుద‌ల చేసారు. మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు లాంటి క్లాస్ టైటిల్ త‌ర్వాత మ‌రోసారి అలాంటి టైటిల్ తో వ‌స్తున్నాడు శ‌ర్వానంద్. 

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తాను ఒప్పుకోన‌ని చెప్పిన సాయిప‌ల్ల‌వి.. హ‌ను చెప్పిన క‌థ‌కు ప‌డిపోయి ఈ సినిమా చేస్తుంది. అంటే ఈ సినిమాలో హీరోయిన్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. మే నాటికి  షూటింగ్ అంతా పూర్తి కానుంది. ఎంసిఏలో సాయిప‌ల్ల‌వి పాత్ర‌ను క‌ట్ చేసార‌ని వ‌స్తున్న నేప‌థ్యంలో శ‌ర్వా సినిమాలో మాత్రం పూర్తిగా ప‌ల్ల‌వి పాత్రే సినిమాకు హైలైట్ అవుతుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా హ‌ను త‌న సినిమాల్లో హీరోయిన్ల‌కు మంచి పాత్ర‌లే ఇచ్చాడు. లై మిన‌హాయిస్తే అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథల్లో హీరోయిన్ల పాత్ర‌ల‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మొత్తానికి చూడాలిక‌.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు ఎలా ఉండ‌బోతుందో.. నిజంగానే ఈ సినిమా ప‌డి ప‌డి లేస్తుందో లేదంటే ఒకేసారి పైకి బాగా లేస్తుందో చూడాలిక‌..!

More Related Stories