English   

శర్వానంద్, సాయి పల్లవి నేపాల్ వెళుతున్నారు

padi padi leche manasu

సక్సస్ ఫుల్ హీరో శర్వానంద్.. లక్కీ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ‘పడిపడి లేచె మనసు’. లవ్ స్టోరీస్ తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 1990స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ అని ఇప్పటి వరకూ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ తో పాటు మేకోవర్ కూడా కనిపిస్తోంది. మరోవైపు రెండు జన్మల ప్రేమకథ అని కూడా వినిపిస్తోంది. మరి ఇది ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న సినిమా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. 

గత కొంత కాలంగా కలకత్తాలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కలకత్తాలో ఏకంగా 70రోజుల భారీ షెడ్యూల్ జరిపారు. ఇక అక్కడి నుంచి యూనిట్ నేపాల్ షిఫ్ట్ అవుతోంది.నేపాల్ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్  పూర్తవుతుందని సమాచారం. త్వరలోనే మొత్తం టీమ్ అంతా నేపాల్ బయలుదేరబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంటిన్యూస్ షెడ్యూల్ తో కాస్త అలసిపోయిన యూనిట్.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత నేపాల్ వెళుతుందట. మొత్తంగా ఈ సినిమాపై శర్వానంద్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 
 

More Related Stories