English   

పిల్ల బేష‌ర‌మ్ గా రెచ్చిపోయిందిగా..!

pallavi sharada

బేష‌రమ్ అంటే సిగ్గు లేకుండా అని అర్థం. ఇప్పుడు ప‌ల్ల‌వి శ‌ర‌దాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అస్స‌లు ప‌రిచ‌యం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే ప‌రిచ‌యం. ఎందుకంటే అక్క‌డ బేష‌ర‌మ్ సినిమాతోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది కాబ‌ట్టి. ర‌ణ్ బీర్ క‌పూర్ మంచి పీక్స్ లో ఉన్న‌పుడు ఈయ‌న‌తో జోడీ క‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. నాలుగేళ్ల కింద ద‌బంగ్ ద‌ర్శ‌కుడు అభిన‌వ్ క‌శ్య‌ప్ తెర‌కెక్కించిన బేష‌ర‌మ్ తోనే బాలీవుడ్ కు వ‌చ్చింది ప‌ల్ల‌వి.

కానీ తొలి సినిమానే డిజాస్ట‌ర్ కావ‌డంతో ఎంత వేగంగా వ‌చ్చిందో.. అంతే వేగంగా వెన‌క్కి వెళ్లిపోయింది. కానీ సీరియ‌ల్స్ తో పాటు అప్పుడ‌ప్పుడూ హాట్ ఫోటోషూట్ల‌తో కూడా క‌వ్విస్తూ.. ఇటు ప్రేక్ష‌కుల‌కు అటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు తానింకా ఉన్నాన‌ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ప‌ల్ల‌వి చేసిన ఓ ఫోటోషూట్ వైర‌ల్ అయిపోయింది. హాట్ హాట్ అందాల‌తో గూగుల్ లో సైతం మంట‌లు రేపింది ఈ భామ‌. ప్ర‌స్తుతం అవ‌కాశాల్లేక యాడ్స్ తో పాటు సీరియ‌ల్స్ తో బిజీ బిజీగా గ‌డిపేస్తుంది ప‌ల్ల‌వి.

More Related Stories