English   

దసరా బరిలో పందెంకోడి -2 

PandemKodi2-release
2018-08-22 16:49:29

రీల్ అండ్ రియల్ హీరో ఎవరంటే సౌత్ లో ఇమ్మీడియట్ గా వినిపించే పేరు విశాల్. ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం చేయడంలో ముందుంటాడు. అందరికంటే ముందే స్పందిస్తాడు. రీసెంట్ గా కేరళ వరద సాయం చేయడంలోనూ చాలాముందున్నాడు విశాల్. ఇక మరోవైపు హీరోగానూ ఈ మధ్య వరుస విజయాలు సాధిస్తున్నాడు. డిటెక్టివ్, అభిమన్యుడు వంటి డిఫరెంట్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న విశాల్ ప్రస్తుతం మరోసారి తనదైన శైలిలో మాస్ మూవీతో రాబోతున్నాడు. అదే సండాకోళై-2(పందెంకోడి-2).

దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సండాకోళై సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఇది. నిజానికి ఈ సినిమాతోనే విశాల్ కు అక్కడ హీరోగా కొంత గుర్తింపు వచ్చింది. అంతకు రెండు మూడు సినిమాలు చేసి ఉన్నా.. అతన్ని హీరోగా పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు అక్కడి ఆడియన్స్. కానీ పెందెంకోడితోఏకంగా ఒకేసారి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ నూ మెప్పించాడు. ఇక అప్పటి నుంచి మనోడు బాక్సాఫీస్ కు తన ‘పొగరు’ చూపిస్తూనే ఉన్నారు. అయితే కొంతకాలంగా అతను మరీ రొటీన్ మాస్ సినిమాలు చేస్తున్నాడని ఆడియన్స్ తిరస్కరించారు. దీంతో రూట్ మార్చి డిటెక్టివ్, అభిమన్యుడు తరహా సినిమాలతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ ట్రాక్ లోనే మరోసారి పందెంకోడి-2నూ హిట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. 

ఇక తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన లింగుస్వామే ఈ చిత్రాన్నీ డైరెక్ట్ చేశాడు. లేటెస్ట్ గా సినిమా షూటింగ్ పూర్తయింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. అప్పుడు తండ్రి పాత్రలో నటించిన రాజ్ కిరణ్ ఈ చిత్రంలోనూ కనిపిస్తాడు. కంప్లీట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాను దసరా బరిలో అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నాడు విశాల్. మరి అప్పటికి తెలుగులో మనోడికి స్కోప్ ఉంటుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories