English   

విశాల్ అంత ప‌ని చేస్తున్నాడా.. ఎంత న‌మ్మ‌కమో..? 

Pandem-Kodi-2
2018-10-16 15:34:38

ఏ సినిమా అయినా కూడా విడుద‌ల‌కు ముందు రోజు ప్రీమియ‌ర్స్ వేయ‌డం అల‌వాటే. కానీ అది రివ్యూ రైట‌ర్ల‌కు కానీ సెలెబ్రెటీస్ కు కానీ తీసుకొని వ‌చ్చి వేసి చూపిస్తారు. కానీ సినిమా కొనే బ‌య్య‌ర్ల‌కు మాత్రం చూపించ‌రు. ఎందుకంటే ఏదైనా తేడా జ‌రిగితే వాళ్లు కూడా తేడాగా మారిపోతార‌ని.. రేట్ల విష‌యంలో తేడా జ‌రుగుతుందని అంత రిస్క్ తీసుకోరు. మొన్నీమ‌ధ్యే శ్రీ‌నివాస క‌ళ్యాణం సినిమాను మూడు రోజుల ముందే డిస్ట్రిబ్యూట‌ర్లు అందరికీ చూపించాడు దిల్ రాజు. అయితే అది ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మేకు ఇలాంటి రిస్కులు తీసుకోవ‌డం లేదు. కానీ ఇప్పుడు విశాల్ మాత్రం ఇదే చేస్తున్నాడు. 

ఈయ‌న త‌న పందెంకోడి 2 సినిమాను త‌మిళ‌నాట విడుద‌ల‌కు ఒక‌రోజు ముందే అంద‌రు బ‌య్య‌ర్ల‌కు షో వేసి చూపిస్తున్నాడు. అది కూడా వాళ్ల‌కు న‌చ్చితేనే పూర్తి డ‌బ్బులు ఇవ్వండి అంటూ ఆఫ‌ర్ కూడా ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. అస‌లు ఓ నిర్మాత ఈ రేంజ్ రిస్క్ తీసుకోవ‌డం అనేది చిన్న విష‌యం కాదు. కానీ చేసి చూపించాడు విశాల్. ఓ నిర్మాత‌గా వాళ్ల క‌ష్టాలు తెలుసు కాబ‌ట్టి బ‌య్య‌ర్ల త‌రఫున కూడా ఆలోచించి రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నాడు విశాల్. మ‌రి పందెంకోడి 2 కోసం ఈయ‌న తీసుకుంటున్న రిస్క్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలిక‌. అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది ఈ చిత్రం.. 17నే అంద‌రు బ‌య్య‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా షో ప‌డ‌బోతుంది.

More Related Stories