English   

మెగా హీరో సినిమాలో నటించడానికి నటీనటులు కావలెను !

Panja Vaishnav Tej debut movie additions on march 21 st at kakinada
2019-03-19 14:56:58

ఇప్పటికీ మెగా ఫ్యామిలీ లో సుమారుగా అరడజను మంది హీరోలు ఉన్నారు. వారికి తోడుగా ఇటీవలే మెగాస్టార్ కి రెండో మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ కి తమ్ముడు అయిన వైష్ణవ తేజ్ హీరోగా ఒక సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. గతంలో లో డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ అసిస్టెంట్ గా పనిచేసిన సానా బుచ్చిబాబు అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చూసినట్లయితే కొంచెం అటు ఇటు గా రామ్ చరణ్ రంగస్థలంలో ఉన్న లుక్ ని పోలి ఉంటుంది. సముద్రం ఒడ్డున ఒక కాలు పడవ మీద పెట్టి, భుజానికి వల వేసుకుని ఉన్న ఆ లుక్ ని చూస్తే ఎవరికైనా ఇందులో ఆయన వేసేది జాలరి వేషం అనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సినిమా యూనిట్ నుంచి తాజాగా కాస్టింగ్ కాల్ ఒకటి బయటకు వచ్చింది.

ఈనెల 21న కాకినాడలో ఆడిషన్స్ పెడుతున్నామని దగ్గర్లో ఉన్న స్టేజ్ ఆర్టిస్ట్ లు అలాగే ఆసక్తి ఉన్న నటులు ఎవరైనా నా నా వచ్చి ఆడిషన్స్ పాల్గొనవచ్చని తెలిపింది. అయితే ఇందులో వయసు పరిమితం లేదు ఏ వయసు వారైనా ఈ ఆడిషన్స్ కి హాజరు కావచ్చు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. దీని బట్టి చూస్తే షూట్ కూడా దాదాపు కాకినాడలోనే ఉండబోతుందని అర్థమవుతోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. అన్న సాయి ధరమ్ తేజ్ హీరోగా లాంచ్ అయినా రేయ్ సినిమా, అలాంటి సినిమా ఒకటి ఉందని కూడా అ చాలా మందికి తెలీదు. మరి తమ్ముడుని లాంచ్ చేసే ఈ సినిమా ఏం చేస్తుందో వేచి చూద్దాం

More Related Stories