English   

పంతం ప్రాఫిట్స్ తేజ్ పై ఆధార‌ప‌డి ఉన్నాయా..?

pantham
2018-07-05 19:45:49

యాంగ్రీ యంగ్ మేన్ గోపీచంద్ హీరోగా న‌టించిన పంతం విడుద‌లైంది. ఇది గోపీచంద్ కు 25వ సినిమా. చక్ర‌వ‌ర్తి అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమాపై గోపీచంద్ భారీ అంచ‌నాల‌తో ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌తి ప్రెస్ మీట్ లో్ చాలా కాన్ఫిడెంట్ గా ప్ర‌మోట్ చేశాడు. ఇంకా చెబితే తన తండ్రి టి క్రిష్ణ శైలిని గుర్తుకు తెచ్చే సినిమా ఇది అన్నాడు. మొత్తంగా మంచి అంచ‌నాల‌తో వ‌చ్చిన పంతం నిజంగా ఆ స్థాయిలో ఉందా అంటే డౌటే అని చెప్పాలి. బావుంది.. కానీ మ‌రీ గోపీచంద్ చెప్పినంత కాదు. రొటీన్ స్టోరీకే కాస్త నేటి ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా డిజిట‌ల్ ట‌చ్ ఇచ్చిన‌ట్టు రివ్యూస్ వ‌చ్చాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న గోపీచంద్ కు ఈ సారి నిరాశ అని చెప్ప‌లేం కానీ ఆశించినంత ఫ‌లితం వ‌స్తుందా అనేది ఫ‌జిల్ గా మారింది.

అయితే ఈ ఫ‌జిల్ విప్పేది సాయిధ‌ర‌మ్ తేజ్ మూవీ కావ‌డం విశేషం. గోపీచంద్ లాగానే వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న పేరుతోనే తేజ్ ఐల‌వ్యూ అనే సినిమాతో వ‌చ్చాడు. అయితే ఈ సినిమా రిజ‌ల్ట్ ను బ‌ట్టి పంతం ప్రాఫిట్స్ ఉండ‌బోతున్నాయి. అంతే తేజ్ తేడా కొడితే పంతం పిక‌ప్ అవుతుంది. లేదంటే డౌన్ అవుతుంది. ఇక ల‌వ్ స్టోరీస్ స్పెష‌లిస్ట్ క‌రుణాక‌ర‌న్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన తేజ్ ఐ ల‌వ్యూ ఈ సారి ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుందనే న‌మ్మ‌కంతో ఉన్నారు.  అటు ఈ సినిమా తేజ్ తో పాటు హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్, ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ కు కూడా కీల‌కంగా ఉండ‌టం విశేషం. మొత్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద తేజ్ రిజ‌ల్టే ఇప్పుడు పంతం ప్రాఫిట్స్ ను డిసైడ్ చేయ‌బోతోంద‌నేది ట్రేడ్ అంచ‌నా.

More Related Stories