English   

గోపీచంద్ పంతం దేనికోసం ..

Pantham
2018-03-21 16:23:28

ఓ గట్టి హిట్ కోసం పంతం పట్టాడు గోపీచంద్. పంతం అతనికి 25వ సినిమా. ఇవాళ ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. నిజానికి ఇది రేపు విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్. కానీ కొందరి అత్యత్సాహంతో ఇవాళే అనివార్యంగా విడుదల చేయాల్సి వచ్చింది. అంటే ఎవరో లీక్ చేశారన్నమాట. పంతం.. ఫర్ ఏ కాజ్ అనే క్యాప్షన్ తో ఉన్న ఈ లుక్ తో గోపీ ఇంటెన్సిటితో కనిపిస్తున్నాడు.. లైట్ గా పెరిగిన గడ్డం కొంత గౌతమ్ నందా లుక్ ను గుర్తుకు తెస్తున్నా.. ఈ లుక్ చూస్తే ఇది కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా అర్థమౌతోంది. ఒక టేబుల్. దానిపై రకరకాల పెన్నులు, వెనక గోడపై పేపర్ క్లిప్పింగ్స్.. ఒక పేపర్ లో నాటి హామీలు నీటి మూటలు అనే హెడ్ లైన్ కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది పొలిటికల్ సెటైరికల్ సినిమా అనే డౌట్ వస్తోంది. ఫర్ ఏ కాజ్ అనే క్యాప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హామీలు అమలు చేయని పొలిటీషియన్స్ పై వార్ చేసే కుర్రాడు పట్టిన పంతమా ఇది అనిపించక మానదు. 

యాంగ్రీ యంగ్ మేన్ గా వచ్చిన గుర్తింపును చేజేతులా పాడు చేసుకున్న స్టార్ గోపీచంద్. అనవసరంగా కామెడీ చేసి నవ్వులపాలయ్యాడు. మిస్టేక్ తెలుసుకుని మళ్లీ తనదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ మధ్య చేసిన గౌతమ్ నందా, ఆక్సీజన్ కూడా మెప్పించలేకపోయాయి. దీంతో కె చక్రవర్తి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న పంతంతో క్లాస్ మాస్ కలబోసిన కథతో వస్తున్నాడు. రాధామోహన్ నిర్మాత. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ 25వ సినిమాన కెరీర్ లో మెమరబుల్ గా మలచుకోవడమే కాదు.. ఇకపై కంటిన్యూ హిట్స్ కు రూట్ గానూ చేసుకోవాలనుకుంటున్నాడు గోపీచంద్. లుక్ ను బట్టే హిట్ ను డిసైడ్ చేయలేం కానీ.. ఈ సినిమాకు స్టార్ క్యాస్టింగే కాదు.. స్టార్ టెక్నిషియన్స్ కూడా పనిచేస్తున్నారు. అవన్నీ హెల్ప్ అయితే గోపీచంద్ పంతం నెగ్గుతుందనుకోవచ్చు. 

More Related Stories