English   

పంతం ఫస్ట్ డే కలెక్షన్స్..!! 

pantham
2018-07-07 21:11:06

ఎన్నో రోజులు తర్వాత యాంగ్రీ యంగ్ మేన్ గోపీచంద్ కళ్లల్లో నిజమైన ఆనందం కనిపిస్తోంది. లేటస్ట్ గా గోపీ నటించిన పంతం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పంతం ఫర్ ఏ కాజ్ అంటూ వచ్చిన ఈ మూవీ సోషల్ మెసేజ్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ నూ అందిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.. అయితే గోపీచంద్ ఇప్పుడు సిట్యుయేషన్ లో ఓ మాదిరి హిట్ కూడా చాలా పెద్ద విజయంలా అనిపిస్తోంది.

అందుకే ఆ ఆనందాన్ని ఆడియన్స్ తో పంచుకోవాలనుకున్నాడు. ఈ మేరకు సక్సస్ టూర్ కూడా మొదలుపెట్టారు. ఈ టూర్ లో భాగంగా ఇవాళ వరంగల్ లో సందడి చేసింది మూవీ టీమ్. అయితే సినిమా కలెక్షన్స్ కూడా ఒక రకంగా బానే ఉన్నాయని చెప్పొచ్చు. అటు తేజ్ ఐ లవ్యూ మరీ బ్యాడ్ రివ్యూస్ రావడం కూడా పంతం కు కలిసొచ్చింది. అందుకే ఫస్ట్ డే కలెక్షన్స్ లో పంతం.. ఈమధ్య కాలంలో వచ్చిన గోపీచంద్ సినిమాల నుంచి సో బెటర్ అనిపించుకుంది. 
ఇక ఏరియాల వారీగా పంతం కలెక్షన్స్ చూస్తే షేర్స్ రూపంలో ఇలా ఉన్నాయి

నైజాం    - 1 కోటి 12 లక్షలు
సీడెడ్    - 47లక్షలు 
ఈస్ట్    - 20లక్షల 92వేలు
వెస్ట్    - 16లక్షల 35వేలు 
యూఏ    - 34లక్షల 79వేలు
నెల్లూర్    - 12లక్షలు
గుంటూర్    - 33లక్షలు
కృష్ణా    - 15లక్షల 77వేలు

మొత్తంగా ఏపీ, నైజాంలో కలిపి మొదటి రోజు 2కోట్ల 92లక్షల షేర్ వసూలు చేసి ఓ గుడ్ ఓపెనింగ్ అనిపించుకుంది.  


 

More Related Stories