English   

స్పీడ్ పెంచిన పేపర్ బాయ్ 

Paper-Boy-release
2018-08-08 18:40:07

డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారాడు. రచ్చ తర్వాత సరైన హిట్ లేని ఈ దర్శకుడు ఈ సారి కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ న్యూ ఏజ్ మూవీస్ కు ఎంకరేజ్ చేయబోతున్నాడు. ఆ క్రమంలో చేస్తోన్న సినిమానే ‘పేపర్ బాయ్’. సంపత్ నంది క్రియేటివ్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీతో జయశంకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. దివంగత దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో రియా సుమన్, తాన్యాహోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా నుంచి విడుదల చేసిన రెండు లిరికల్ సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
 
ఇక ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్న ‘పేపర్ బాయ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. సరికొత్త కథ, కథనాలతో వస్తుందని చెబుతోన్న పేపర్ బాయ్ సెప్టెంబర్ 7న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. బి టెక్ చదివి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే ఓ కుర్రాడు తను బ్రతకడం కోసం పేపర్ బాయ్ అవతారం ఎత్తుతాడు. అయినా తన యాంబిషన్ మర్చిపోడు. మరి ఈ క్రమంలో అతని యాంబిషన్ ఏంటీ.. అది అతను చేరుకున్నాడా లేదా అనేది కథగా టీజర్ ను బట్టి అర్థమైంది. మొత్తంగా సెప్టెంబర్ 7న విడుదల అంటే పెద్దగా టైమ్ లేదనే చెప్పాలి. అంటే త్వరలోనే ట్రైలర్, ఆడియో, ప్రీ రిలీజ్ అంటూ ప్రమోషన్స్ తో హడావిడీ చేయబోతున్నారనుకోవచ్చు. మరి నిర్మాతగా మారిన సంపత్ నందికి ఈ పేపర్ బాయ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి. 

More Related Stories