English   

బిటెక్ కుర్రాడు ‘పేపర్ బోయ్’ అయ్యాడు

Paper-boy
2018-07-21 13:36:55

దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారాడు. చేసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంపత్.. కొంతకాలంగో కొత్త సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడు అనుకున్నారు. కానీ ఈయన సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. ఔత్సాహిక దర్శకులకు తన బ్యానర్ లో అవకాశాలివ్వడమే ఈ బ్యానర్ ఉద్దేశ్యం అని చెప్పాడు. అన్నట్టుగానే ఇప్పుడు ఫస్ట్ మూవీగా పేపర్ బాయ్ తో వస్తున్నాడు. జయశంకర్ అనే దర్శకుడు ఈ పేపర్ బాయ్ నిర్దేశకుడు. దివంగత దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్టోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. దర్శకుడుగా మాస్ సినిమాలు చేసిన సంపత్ నంది నిర్మాతగా క్లాస్ సినిమాతో వస్తున్నట్టు కనిపిస్తోంది. 

టీజర్ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. రిచ్ గాళ్, పూర్ బాయ్ స్టోరీలానే కనిపిస్తోన్నా.. కథలో ఏదో నవ్యత ఉండేలా అనిపిస్తోంది. తాన్యాహోప్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టాలెంటెడ్ గా పేరున్నా ఇంత వరకూ భీమ్స్ కు పెద్ద బ్రేక్ రాలేదు. కానీ ఈ సినిమాకు మంచి సంగీతం అందించినట్టు టీజర్ లో వినిపిస్తోన్న బ్యాక్ గ్రౌండ్ చెబుతోంది. ఇక సౌందర రాజన్ సినిమాటోగ్రఫీ ఈ పేపర్ బాయ్ కు హైలెట్ అయ్యే అవకాశాలున్నాయి. అంత ఆహ్లాదంగా కనిపిస్తోంది సినిమాటోగ్రఫీ. అయితే టీజర్ చివర్లో పెద్ద ట్విస్టే ఇచ్చాడు. పేపర్ వేస్తున్నాడు కాబట్టి ఈ కుర్రాడు ఏదో చదువు పెద్దగా రానివాడో లేక చదువుకుంటున్నవాడో కాదు.. బిటెక్ చదివాడు. పేపర్ బ్రతకడానికి పేపర్ వేస్తూ.. భవిష్యత్ కోసం బిటెక్ పట్టాలు పట్టుకుని ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నాడు. మొత్తంగా పేపర్ బాయ్ టీజర్ ఆకట్టుకుందనే చెప్పాలి. 

More Related Stories