English   

మహేష్ ట్విస్ట్.. వంశీ ప్లేస్ లో పరుశు రామ్..

Parasuram
2020-02-24 13:13:54

మహేష్ కు అత్యంత సన్నిహతుడిగా వంశీ పైడిపల్లికి పేరుంది. అలాంటిది వంశీ పైడిపల్లితో మహేష్ చేయవలసిన మూవీ క్యాన్సిల్ అవ్వడం వెనుక పెద్ద వ్యవహారమే ఉందని అంటున్నారు. నిజానికి సరిలేరు సినిమా సక్సెస్ మీట్ లు అవగానే మహేష్ హాలిడేకి వెళ్లిపోయాడు. దీంతో ఇక మహేష్ అమెరికా నుండి తిరిగి రావడమే వంశీ పైడిపల్లి మూవీ ప్రారంభోత్సవ తేది ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ అది క్యాన్సిల్ అని వార్త బయటకి వచ్చింది. 

అయితే ఇలా మహేష్ ఇలాంటి ఊహించని ట్విస్ట్ ఇవ్వడం వెనుక కొంత వంశీ పైడిపల్లి డబుల్ గేమ్ కారణంమని అంటున్నారు. అదేంటంటే మహేష్ వాస్తవానికి అమెరికాకి వెళ్లేముందు వంశీ పైడిపల్లి వ్రాసిన కథను వినాలని ప్రయత్నించాడట. వంశీ కథ ఇప్పటికే పూర్తిగా తయారయిదని ఆకథ దిల్ రాజ్ కు కూడా బాగా నచ్చిందని వంశీ మహేష్ తో చెప్పడంతో మహేష్ ఆ మాటలను నమ్మి అమెరికా వెళ్ళాడట. ఇక మహేష్ అమెరికా నుండి తిరిగి వచ్చి వంశీతో కధ విన్నాక్ షాక్ అయినట్లు చెబుతున్నారు. 

ఈ కథ మహేష్ కు ఏమాత్రం నచ్చకపోవడంతో మహేష్ ఆకథ తనకు నచ్చలేదు అని చెప్పడమే కాకుండా అలాంటి కథ దిల్ రాజ్ కు ఎలా నచ్చింది అన్న విషయమై దిల్ రాజ్ ను కూడా కాంటాక్ట్ అయ్యాడట. అయితే అప్పుడు దిల్ రాజు వంశీ తనకు ఇంతవరకు కథ చెప్పలేదనీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో వంశీ వీరిద్దరి మధ్య ఆడిన డబుల్ గేమ్ బయటపడటంతో ఈ ప్రాజెక్ట్ ను మహేష్ క్యాన్సిల్ చేసాడని అంటున్నారు. ఇప్పటికిప్పుడు మరో సినిమా చేయాలని పరుశు రామ్ ని మహేష్ లైన్ లోకి తెచ్చాడని అని అంటున్నారు.  

More Related Stories