English   

ఈ ‘పరిచయం’ బావుంది

parichayam

పరిచయం.. ఓ కొత్త సినిమా. ఇవాళే నితిన్ చేతులమీదుగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆసాంతం చాలా ఫ్రెష్ గా ఉంది. ప్రేమికులను విడదీసే మొదటి శతృవు తల్లిదండ్రులే. అయితే వారి కారణాలు వారికి ఉంటాయి. కాకపోతే అన్ని కారణాలు సహేతుకం అనిపించుకోవు. అందుకే చాలా ప్రేమలను ఇళ్లల్లోనే సమాధి అవుతుంటాయి. అలా కాకుండా తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఓ జంట ఏం చేసింది అనేది చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తోంది. కానీ ఏదో కొత్తదనం అనిపిస్తోంది. హీరో విరాట్, హీరోయిన్ సిమ్రత్ కౌర్ జంట బావుంది. సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది.. మాటలు హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. మొత్తంగా ఈ పరిచయం ట్రైలర్ తోనే చాలా బావుంది అనిపించక మానదు..

ప్రేమను ఫీలవ్వాలి కానీ ప్రేమించినందుకు ఫీలవకూడదు.. ప్రాణంతో ఉన్న ప్రతిక్షణం నీ చేతిని వదలను, వదిలిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను.. నీ కన్నీళ్లు నీకెంత విలువైనవో.. నిన్ను కన్నవాళ్ల కన్నీళ్లు అంతకంటే విలువైనవి.. వంటి మాటలు సూటిగా మనసుల్ని తాకుతాయి. ఇక ట్రైలర్ చివర్లో.. మనం ప్రేమిస్తున్నాము అనుకునే కంటే మనం ప్రేమిస్తున్నామా అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయ్ అనే డైలాగ్ ఆలోచింప చేసేలా ఉంది. మొత్తంగా శ్రీకాంత్ చెన్నా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ నిజ జీవిత కథ నుంచి ఇన్స్ స్పైర్ అయింది అని చెబుతున్నారు. ఏదేమైనా ట్రైలర్స్ తో ఆకట్టుకున్నవన్నీ మంచి సినిమాలే అని చెప్పలేం.. కానీ అవి ట్రైలర్ లానే ఆకట్టుకుంటే ఖచ్చితంగా వారి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. 
 

More Related Stories