English   

ప‌వ‌న్ కోబ‌లే.. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌..!

pavan Kobali making as ntr aravindha sametha
2018-05-28 10:02:29

కోబ‌లి.. చాలా ఏళ్ల కింద ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త్రివిక్ర‌మ్ చేయాల‌నుకున్న సినిమా ఇది. అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్ప‌ట్లో అత్తారింటికి దారేది బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ కోసం మ‌రో క‌థ సిద్ధం చేసాడు మాట‌ల మాంత్రికుడు. దాని పేరు కోబ‌లి. అప్ప‌ట్లో అనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చింది. ఇక సినిమా ప‌ట్టాలెక్క‌డ‌మే త‌రువాయి అన్న‌పుడు ఆగిపోయింది. దానికి కార‌ణం అప్ప‌ట్లో 2014 ఎన్నిక‌లు రావ‌డ‌మే. ప‌వ‌న్ ఎల‌క్ష‌న్స్ తో బిజీకావ‌డంతో కోబ‌లి బ‌లైపోయింది. ఆ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్ లో వ‌చ్చిన అజ్ఞాత‌వాసి అలా డిజాస్ట‌ర్ అయిపోయింది. అయితే అప్పుడు ఆగిన కోబ‌లి ఇప్పుడు మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతుందేమో అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ తో తెర‌కెక్కిస్తోన్న అర‌వింద స‌మేత‌. అవును.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా సీమ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతోంది. శత్రువుల ఫై దాడి చేస్తున్నప్పుడు కసి కోసం కోరు బలి నరుకు బలి అని గట్టిగా అరుస్తారని అందుకే అప్ప‌ట్లో ప‌వ‌న్ సినిమాకు కోబ‌లి టైటిల్ పెట్టామ‌న్నాడు త్రివిక్ర‌మ్. అప్పుడు సీమ నేప‌థ్యంలో రాసుకున్న క‌థ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు యూజ్ అవుతుంద‌ని చెప్పాడు త్రివిక్ర‌మ్. అయితే అది ఇది ఒకే క‌థ కాదంటున్నాడు మాట‌ల మాంత్రికుడు. మ‌నోడు కాద‌ని చెబుతున్నా.. పోస్ట‌ర్లు విడుద‌ల‌వుతున్న తీరు చూస్తుంటే నాటి కోబ‌లే.. నేటి అర‌వింద స‌మేతేమో అనే అనుమానం వ‌స్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ప‌వ‌న్ మిస్ అయిన క‌థ ఎన్టీఆర్ కే ఏ మేర‌కు క‌లిసొస్తుందో..? 

More Related Stories