English   

రేణు ఇంకా ప‌వ‌న్ నే ప్రేమిస్తుందా..?

Renu-desai
2018-07-09 12:17:23

ఓ వ్య‌క్తి మీద ప్రేమ పుట్టిన‌పుడు అది అంత ఈజీగా చావ‌దు. ఓ హీరోను అభిమానిస్తేనే చ‌చ్చేవ‌ర‌కు అత‌డిపై అభిమానం పోదు. అలాంటిది ప్రేమ ఎలా పోతుంది చెప్పండి..? ఇప్పుడు రేణుదేశాయ్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రెండో పెళ్లికి రెడీ అయినా కూడా ఇప్ప‌టికీ ఈమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ నే ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో రేణు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. దాంతోపాటు ఆమె మాట‌ల‌ను ఒక్క సారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఇంకా ప‌వ‌న్ ప్రేమ‌లోనే ఉందేమో అనిపించ‌క మాన‌దు. ప‌వ‌న్ అంటే కోపం లేదంటూనే.. ఇప్పుడు చేసుకోబోయే వ్య‌క్తిపై ఇంకా ప్రేమ పుట్ట‌లేద‌ని.. త్వ‌ర‌లోనే పుడుతుంద‌ని చెబుతుంది రేణు.

అంటే రెండో భ‌ర్త‌పై ఇంకా ప్రేమ లేదంటే ప‌వ‌న్ ఇంకా మ‌న‌సులో ఉన్నాడ‌నేగా అర్థం. మ‌రోవైపు విడాకుల విష‌యంపై కూడా నోరు విప్పింది రేణు. త‌న‌కు డివోర్స్ కావాల‌ని ఏ రోజు అడ‌గ‌లేద‌ని.. త‌న‌కు తెలియ‌కుండా మ‌రో అమ్మాయితో సంబంధం పెట్టుకుని ప‌వ‌న్ ఓ బిడ్డ‌ను కూడా క‌న్నాడ‌ని.. త‌న‌లాంటి సిచ్యువేష‌న్స్ లో మ‌రో అమ్మాయి ఉంటే ఏం చేసేదని ప్ర‌శ్నిస్తుంది రేణు. ప‌వ‌న్ క‌ళ్యాణే విడాకులు కావాల‌ని అడిగాడ‌ని.. తాను కూడా మ‌రో ప‌రిస్థితి లేక ఇచ్చేసాన‌ని చెబుతుంది రేణు. అభిమానులు కూడా త‌న‌ను వదిన అని పిలిస్తే సంతోషిస్తాను కానీ ప‌వ‌న్ తో క‌లిపి వదిన అంటే మాత్రం ఒప్పుకోనంటుంది. ప‌వ‌న్ ప్ర‌స్తుత భార్య క‌దా ఇప్పుడు మీకు వదిన.. నేను కాదంటుంది రేణు. మొత్తానికి ఈమె విడాకుల ఇష్యూ.. పెళ్లి.. ప్రేమ అన్నీ ఇప్పుడు సంచ‌ల‌నం అయిపోతున్నాయి.

More Related Stories