English   

పాలమూరి పండుగ సాయన్న పాత్రలో పవన్ కళ్యాణ్...

  Pawan Kalyan
2020-07-11 16:01:21

మాయదారి కరోనా వైరస్ వచ్చి ప్లాన్స్ అన్నీ పాడు చేసింది కానీ లేదంటే ఈ పాటికే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కూడా అయ్యేది. ఈయన నటించిన వకీల్ సాబ్ ఎప్పుడో మేలోనే వచ్చుండేది కూడా. అయితే ఇప్పుడు ఈయన రాజకీయాలను పక్కనపెట్టి సినిమాలతో బిజీ అయిపోయాడు. రీ ఎంట్రీ లో మాత్రం ఒకేసారి మూడు సినిమాలకు  పచ్చజెండా ఊపేశాడు. అందులో పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ థియేటర్స్ ఓపెన్ కాగానే విడుదల కానుంది. ఈ సినిమా గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక దాంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా పైనే అందరి కళ్లు ఉన్నాయి. పైగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ పాత్ర పేరు వీర అని అంటున్నారు. అంతేకాదు పవన్ పేరు కలిసొచ్చేలా ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో రెండు పాటలు మాత్రమే ఉండబోతున్నాయి. డాన్సులు, రొమాన్స్ కు దూరంగా ఉంటానని ఇప్పటికే దర్శకుడికి పవన్ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే అలాంటివి లేకుండా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. ఇప్పుడు మరో వార్త కూడా ఈ సినిమా గురించి ఒకటి బయటికి వచ్చింది. ఇందులో 18వ శతాబ్దపు పాలమూరు పండుగ సాయన్న అనే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ బాగానే కష్టపడుతున్నాడు. పవన్‌తో 'ఖుషి' లాంటి సంచలన సినిమాను నిర్మించిన ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పవన్ క్రిష్ సినిమా విడుదల కానుంది. 

More Related Stories