English   

బన్నీ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ 

Pawan-Alluarjun
2018-05-08 18:08:39

చెప్పను బ్రదర్.. ఈ ఒక్క మాట మెగా ఫ్యాన్స్ లో చీలికలు తెచ్చింది. ఆ మాటతో అల్లు అర్జున్ ను విపరీతంగా టార్గెట్ చేశారు.. ట్రాల్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ కొన్ని విషయాలు కొన్ని వేదికలపై అప్పటికే పరిమితం తప్ప.. అవి అన్ని బంధాలకూ వర్తించవు అని ప్రూవ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పిలుపునివ్వగానే.. వెంటనే వాలిపోయాడు అల్లు అర్జున్. అలాగే తన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆడియో వేడుకలోనూ పవన్ కళ్యాణ్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. ఫైనల్ గా ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే.. మేమూ మేమూ ఒకటే.. మీరెందుకు కొట్టుకుంటారు అభిమానులను ఇన్ డైరెక్ట్ర గా వార్న్ చేయడమే. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ? నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. షాక్ అయ్యారా.. బట్ ఇది నిజం. అయితే దీనికి సక్సెస్ మీట్ అని కాకుండా ‘థ్యాంక్స్ టు ఇండియా’మీట్ గా పేరు పెట్టారు. ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్టు నా పేరు సూర్య మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరి చాలా రోజుల తర్వాత ఒకే వేదికపైకి రాబోతోన్న బన్నీ అండ్ పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి. 

More Related Stories