English   

ఆ ఫోటో అర్థం అదేనా ప‌వ‌న్..? 

Pawan-Kalyan
2018-07-06 13:56:10

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేసినా కూడా అర్థం చేసుకోడానికి చాలా టైమ్ ప‌డుతుంది. ఇప్పుడు ఈయ‌న ట్విట్ట‌ర్ లో ఓ ఫోటో షేర్ చేసారు. అది కూడా ఇప్ప‌టి ఫోటో కాదు.. త‌న చిన్న‌ప్ప‌టి ఫోటో. అప్పుడెప్పుడో త‌ను 7వ త‌ర‌గతి చదువుతున్న నాటి ఫోటో అది. అందులో చిరంజీవి, నాగబాబుతో పాటు ప‌వ‌న్ కూడా ఉన్నాడు. ఈ ఫోటోతో పాటు కొంత మ్యాట‌ర్ కూడా పోస్ట్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. అప్పుడ‌ప్పుడే త‌ను శ్వాస‌కోస వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డుతున్న రోజులవి అంటూ ట్వీట్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. అయితే ఉన్న‌ట్లుండి ఇప్పుడు ఈ ఫోటోను ట్వీట్ చేయ‌డం వెన‌క ఉన్న మ‌త‌ల‌బేంటో అర్థం కావ‌డం లేదు. కొంప‌దీసి తామంతా ఇప్ప‌టికీ ఒక్క‌టే అని.. త్వ‌ర‌లోనే అన్న‌ల‌తో క‌లిసి జ‌న‌సేన న‌డుపుతాన‌ని హింట్ ఇస్తున్నాడా అని లేనిపోని అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. అలా చేస్తే గ‌న‌క జ‌న‌సేన‌కు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు లేనిపోని చెడ్డ‌పేరు వ‌స్తుంది. ఇప్ప‌టికే ప్ర‌జారాజ్యం విష‌యంలో చిరంజీవికి బోలెడు నెగిటివ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు కానీ త‌మ్ముడి పార్టీలో జాయిన్ అయితే అది జ‌న‌సేన ఉనికికే ప్ర‌మాదం. మ‌రి ఈ ఫోటో ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఎందుకు ప‌వ‌న్ పోస్ట్ చేసాడో.. ఏం చెప్పాల‌నుకున్నాడో మాత్రం అర్థం కాలేదు. చిన్న‌ప్ప‌టి ఫోటో చూసి ఎంజాయ్ చేయ‌డం త‌ప్ప అభిమానులు కూడా ఏం అర్థం చేసుకోలేక‌పోతున్నారు.
 

More Related Stories