English   

మ‌హేశ్ బావ‌పై ప‌వ‌న్ పంజా.. 

Pawan-Kalyan

కొన్ని రోజులుగా వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ క్ర‌మంలో తెలుగుదేశం నాయ‌కులే ఎక్కువ‌గా బ‌లైపోతున్నారు. ఇప్పుడు మ‌హేశ్ బాబు బావ‌పై కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ళ్లు ప‌డ్డాయి. తాజాగా గ‌ల్లా జ‌య‌దేవ్ పై ట్విట్ట‌ర్ లో క‌మెంట్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. అది కూడా జ‌న‌సేన అఫీషియ‌ల్ నోట్ విడుద‌ల చేసి మ‌రీ గల్లాను నిల‌దీసాడు. వ‌న్ డే ఇంట‌ర్నేషన‌ల్ మ్యాచ్ లా ఒక్క‌సారి స్పెష‌ల్ స్టేట‌స్ పై లోక్ స‌భ‌లో మాట్లాడి.. మౌనం పాటిస్తున్న గ‌ల్లాగారు మీ మౌనం వెన‌క కార‌ణం ఏంటో తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు తెలుగు స‌ర్.. కొత్త సినిమా.. క‌థ‌.. డైరెక్ష‌న్.. బ్యాట‌రీ డౌన్ లాంటి మాట‌లు మానేసి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం పోరాడండి స‌ర్ అంటూ గల్లా ఏంటి నీ సిల్లీ క‌థ అంటూ ఓ ట్వీట్ విడుద‌ల చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. దానికి గ‌ల్లా కూడా స‌మాధానం ఇచ్చారు. 100 స్పీచెస్ ఇస్తే సెంచ‌రీ అంటారు. పార్ల‌మెంట్ లో అది మేం చేసాం. ఎందుకు ప‌వ‌న్ కళ్యాణ్ గారు పిఎంను వెన‌కేసుకొస్తున్నారో అర్థం కావ‌ట్లేదంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. మాది బ్యాట‌రీ అయిపోయిన మాట‌లు కాదు.. ఫుల్లీ ఛార్జింగ్ లో ఉన్నాం అంటూ సెటైర్ వేసాడు గ‌ల్లా. మొత్తానికి ప‌వ‌న్, గ‌ల్లా మ‌ధ్య మాట‌ల యుద్ధం ట్విట్ట‌ర్ వేదిక‌గా బాగానే సాగింది. 

More Related Stories