English   

 ట్రెండ్ సెట్ చేస్తోన్న పవర్ స్టార్ ఫ్యాన్స్

 Pawan Kalyan
2020-07-15 09:10:47

"నేను ట్రెండ్‌ను ఫాలో కాను ట్రెండ్‌ సెట్ చేస్తా " అని గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ఆ డైలాగ్ ను నిజమయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నరు ఆయన ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీన ఉండగా ఇప్పటి నుంచే జనసేనానికి అడ్వాన్స్ బర్త్‌డే విషెస్‌ అందుతున్నాయి. అదేంటి అనుకుంటున్నారా ? నిజానికి తమ తమ అభిమాన హీరోల పుట్టినరోజులప్పుడు టీజర్, ట్రైలర్ రిలీజ్ రోజున ట్రెండ్స్ క్రియేట్ చేయడం రివాజు. అయితే ఇంకా రెండు నెలల సమయం ఉండగానే సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు తమదైన రీతిలో వినూత్న పద్దతిలో వీడియో పోస్టింగులు పెడుతూ గబ్బర్‌సింగ్‌‌కు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ 20 రోజుల షూట్ పెండింగు ఉంది. ఇక మ‌రోవైపు క్రిష్ సినిమా.. హ‌రీష్ సినిమాల‌ను కూడా ఒప్పుకున్నా పవన్ 2020 దాక సెట్స్ కెళ్లే వీలు లేదని చెబుతున్నారు. ఇక ప‌వ‌ర్ స్టార్ పేరుతో ఆర్జీవీ చేస్తున్న సంద‌డి తెలిసిందే. ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజున ఈ సినిమా ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తామ‌ని ఆయ‌న ప్రక‌టించారు. అది కూడా ట్రైలర్ కే రేట్ పెట్టి మరీ.

More Related Stories