English   

ప‌వ‌న్ పోరాటం ఒక్క‌డి కోసం కాదు..!

Pawan-kalyan

ఎప్పుడూ ఫిల్మ్ ఛాంబ‌ర్ మొహం కూడా చూడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంత స‌డ‌న్ గా అక్క‌డికి వ‌చ్చి.. మీడియా మొత్తంలో హ‌డావిడి చేసాడు. కొంద‌రికి ఇది ఇప్ప‌టికీ షాకింగే. అస‌లు ప‌వ‌ర్ స్టార్ అక్క‌డికి రావ‌డం ఏంటి..? ఆయ‌న‌తో పాటు మెగా కుటుంబం అంతా అక్క‌డ క‌నిపించ‌డం ఏంటి.. ఏంటో ఈ అల్ల‌రంతా అనుకున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్ తో పాటు అత‌డి కుటుంబం అంతా త‌మ త‌ల్లిని తిట్టినందుకే వ‌చ్చింద‌ని అనుకున్నారంతా. కానీ ప‌వ‌న్ ఫిల్మ్ చాంబ‌ర్ కు వ‌చ్చింది ఆయ‌న ఒక్క‌డి కోసం కాదు. త‌న త‌ల్లిని తిట్టినందుకు వ‌చ్చినా కూడా అదే మెయిన్ రీజ‌న్ కాదు. ఇండ‌స్ట్రీలో ఏమేం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని.. నిల‌దీయాల‌ని అక్క‌డికి వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. ఇండ‌స్ట్రీ మీదే ఉంటూ.. ఇక్క‌డే బ‌తుకుతూ ఇండ‌స్ట్రీనే ఇంత మాట‌లంటోన్న మీడియాపై ఎందుకు యాక్ష‌న్ తీసుకోవ‌డం లేదంటూ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను ప్ర‌శ్నించ‌డానికి అక్క‌డికి వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. వ్య‌వ‌స్థ‌లో ఇన్ని మార్పులు జ‌రుగుతుంటే ఎందుకు ఎవ‌రూ నోరు విప్ప‌డం లేదంటూ మ‌న‌స్థాపం చెంది అక్క‌డికి వ‌చ్చి నిన‌దించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఇండ‌స్ట్రీ పెద్దల‌ను క‌ల‌వ‌డం.. మీటింగ్ లు పెట్ట‌డానికి రెడీ అవుతుండ‌టం కూడా ఇందులో భాగ‌మే. త‌న‌తో పాటు ఇండ‌స్ట్రీని కూడా ప‌దే ప‌దే విమ‌ర్శిస్తోన్న స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌పై కేసులు వేయ‌డానికి లాయ‌ర్ల‌తో పాటే అక్క‌డికి వ‌చ్చి మీటింగ్ ఏర్పాటు చేసాడు ప‌వ‌ర్ స్టార్. ఈయ‌న ఆవేశం ఇప్పుడు ఒక్క‌డి కోసం అయితే కాదు.. విడివిడిగా ఉన్న ఇండ‌స్ట్రీని ఒక్క‌టి చేయ‌డానికి. మ‌రి ఈయ‌న పోరాటంతో ఇండ‌స్ట్రీలో ఏదైనా మార్పు వ‌స్తుందేమో చూడాలిక‌..? 

 

More Related Stories