English   

పవన్ కళ్యాణ్ పై నిర్మాతల మండలి ఫైర్

Pawan kalyan
2018-03-07 18:33:43

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలుగు నిర్మాతల మండలి(ముఖ్యంగా చిన్న నిర్మాతలు) ఫైర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయం జరిగి కూడా చాలా రోజులు అవుతోందట. అప్పుడు ప్రెస్ కు లీక్ కాకుండా మేనేజ్ చేసినా లేటెస్ట్ గా ఆ వార్తలు బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తానంటూ సభలూ నిర్వహిస్తున్నాడు. కానీ ఇవన్నీ చేయడానికి ఆయనకు ఇమేజ్ ను ఇచ్చింది సినిమా పరిశ్రమ. దర్శకులు,నిర్మాతలు. కానీ వారంతా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కామ్ గా ఉండటం ఎంత వరకూ కరెక్ట్ అని ఆ మధ్య నిర్వహించిన నిర్మాతల మండలి సమావేశంలో కొందరు ఫైర్ అయ్యారని టాక్. అయితే ఇప్పుడీ విషయం బటయకు వస్తే బంద్ ప్రభావం తగ్గుతుందనీ, అటెన్షన్ అంతా పవన్ వైపు డైవర్ట్ అవుతుందనీ.. కాబట్టి కొన్ని రోజులు ఈ విషయం బయటకు రాకుండా చూడాలని అప్పుడే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కు ఈ స్థాయినిచ్చింది సినిమా పరిశ్రమే. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా అన్నయ్యతో సమానమైన ఇమేజ్ ను ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ పెట్టి ప్రశ్నిస్తానన్న పవన్.. తనకు అన్నం పెట్టిన పరిశ్రమ అన్ని ఇబ్బందుల్లో ఉండి ఏకంగా బంద్ వరకూ వెళితే కనీసం ఓ ట్వీట్ కూడా చేయకపోవడం అన్యాయం అంటూ చాలామంది నిర్మాతలు బాధపడ్డారట. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తీరువల్ల పెద్దవారితో పాటు చిన్న నిర్మాతలూ నష్టపోతున్నారు. అయితే ఇద్దరికీ ఒకే రేట్ వసూలు చేయడం వల్ల చిన్న నిర్మాతలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. యాభై కోట్లతో తీసిన సినిమా అయినా, యాభై లక్షలతో తీసిన సినిమా అయినా 100థియేటర్స్ లో విడుదల చేయాలంటే ఒకే ఖర్చవుతుంది. ఇదెక్కడి న్యాయం అంటున్నారు వాళ్లు. ఈ సందర్భంగా చిన్న నిర్మాతల తరఫున ఆ మాటకొస్తే ఏ నిర్మాత తరఫునా ఎప్పుడూ మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇలా సైలెంట్ గా ఉండటం బాలేదని చాలామంది నిర్మాతలు వాపోతున్నారు.

అయితే ఈ సమస్యపై పవన్ ను మాత్రమే ప్రశ్నించాల్సిన అవసరం లేదు. పవన్ మాత్రమే కాదు.. ఏ స్టార్ హీరో కానీ, స్మాల్ హీరో కూడా ఈ ఇష్యూపై మాట్లాడలేదు. అలాంటప్పుడు పవన్ ను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నిర్మాతల వెర్షన్. కానీ సినిమా పరిశ్రమలో ఎదిగి పొలిటికల్ లీడర్ గా మారిన పవన్ కు ఇలాంటి ఇష్యూస్ పై స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉందంటున్నారు చాలామంది. ఏదేమైనా నలుగురి కోసం ప్రశ్నిస్తాననడం బానే ఉంది. కానీ నడిచివచ్చిన బాట ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కామ్ గా ఉండటం కూడా కరెక్ట్ కాదేమో పవన్ కళ్యాణ్.. 

More Related Stories