English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ‌వ‌రం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాడంటే.. 

Pawan-kalyan
2019-03-20 11:55:21

ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాలు ఉండగా పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి మాత్రమే ఎందుకు పోటీ చేస్తున్నారు.. దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా.. లేదంటే అక్కడకు బలం బాగా ఉంది అని సర్వే లో తేలిందా.. ఇప్పుడు ఇదే అందరు చ‌ర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడానికి ప్రత్యేకంగా ఒక కారణం ఉంది.. దాని వెనుక ఒక బలమైన సెంటిమెంటు ఉంది. 1956 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో అక్కడ ఏ పార్టీ అభ్యర్థి పోటీచేసి గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతోనే ఆయన కావాలని భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. తెలుగుదేశం అభ్య‌ర్థి గెలిస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 

రాష్ట్ర రాజకీయాలను డిసైడ్ చేస్తున్న భీమవరం సెంటిమెంట్ ను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతున్నాడు. అక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు. భీమవరం నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కింగ్ మేకర్ కావాలని చూస్తున్నాడు పవర్ స్టార్. ఈ నియోజకవర్గంతో పాటు గాజువాకలో కూడా పోటీ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే వదిలిపెడతాడు అనేది కూడా ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇదిలా ఉంటే మార్చి 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో గాజువాకలో నామినేషన్ వేయనున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత రోజు భీమవరంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నామినేషన్ వేయబోతున్నాడు ఈ జనసేనాని. మరి ఈ రెండు నియోజకవర్గాల నుంచి పవన్ గెలిస్తే జనసేన ఎలాంటి ప్రభంజనం సృష్టించ‌బోతుందో చూడాలి.

More Related Stories