English   

బాబోయ్ ప‌వ‌న్.. ఏంటా ఆవేశం..? 

Pawan-Kalyan-TDP

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆవేశం ఎక్కువ‌. ఇందులో కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. అది అంద‌రికీ తెలుసు క‌దా అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ ఆవేశ‌మే ప‌వ‌న్ ను ఏం చేస్తుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు అభిమానులు. సినిమాల్లో ఆవేశం ఓకే కానీ రాజ‌కీయాల్లో ప‌నికిరాదంటున్నారు విశ్లేష‌కులు. కానీ ప‌వ‌న్ మాత్రం అవేవీ ప‌ట్టించుకునేలా క‌నిపించ‌ట్లేదు. త‌న‌కు తోచిందే క‌ర్త‌వ్యం అంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఈ హీరో. నిన్న‌టికి నిన్న జ‌రిగిన మీటింగ్ లో కూడా ప‌వ‌న్ ఆవేశాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. అస‌లు మిత్ర‌ప‌క్షం అని కూడా చూడ‌కుండా టీడిపితో చెడుగుడు ఆడుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. చాలా రోజుల త‌ర్వాత ఈయ‌న నుంచి ప‌ర్ ఫెక్ట్ స్పీచ్ వ‌చ్చిందంటున్నారు అభిమానులు కూడా. ఈ స్పీచ్ విన్నాకే ప‌వ‌న్ నుంచి ఏదో ఊహించ‌వ‌చ్చ‌ని ఆశిస్తున్నారు కార్య‌క‌ర్త‌లు. అయితే ప‌వ‌న్ త‌ర్వాత రెండో స్థాయి లీడ‌ర్ లేక‌పోవ‌డం జ‌న‌సేన‌కు పెద్ద మైన‌స్. దీనిపై కూడా ప‌వ‌న్ ఆలోచించాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు విశ్లేష‌కులు. మ‌రి దీన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత‌వ‌ర‌కు ప‌ట్టించుకుంటాడు అనేది చూడాలి..! ఇప్పుడు తీరు చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడిపితో పూర్తిగా బంధం తెంచేసుకున్న‌ట్లే అని అర్థ‌మైపోతుంది. ఒంట‌రిగానే పోరుకు సై అంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న ఆవేశం జ‌న‌సేన‌ను జ‌నం వైపు న‌డిపిస్తుందో.. లేదంటే మ‌రోవైపు తీసుకెళ్తుందో..?

More Related Stories