English   

ర‌వితేజ‌కు సిగ్గులేద‌న్న ప‌వ‌ర్ స్టార్..

ravi-teja-Pawan-kalyan

అవును.. అచ్చంగా ఇవి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోట్లోంచి వ‌చ్చిన మాట‌లే. మ‌రో హీరోను ప‌ట్టుకుని అంద‌రి ముందు సిగ్గు లేద‌ని చెప్పేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ర‌వితేజ‌ను చూస్తుంటే త‌న‌కు ఇదే అనిపిస్తుంద‌ని.. అస‌లు సిగ్గు అనే మాట‌ను పూర్తిగా ఇంట్లో వ‌దిలేసి.. ఒంటికి ప‌ని చెబుతాడ‌ని చెప్పాడు ప‌వ‌న్. ఈయ‌న తాజాగా నేల‌టికెట్ ఆడియో వేడుక‌కు వ‌చ్చాడు. రామ్ త‌ళ్లూరితో ఉన్న స్నేహం కార‌ణంగా ఈ ఫంక్ష‌న్ కు వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. ఈ వేడుక లోనే ర‌వితేజ గురించి అనుకున్న‌ది చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాను న‌టుడు కాక‌ముందే ర‌వితేజ న‌టుడు అయ్యాడ‌ని.. అప్పుడు తాను న‌టుడిని కాదు కాబ‌ట్టి ర‌వితేజ గుర్తించ‌లేదేమో అని చ‌మ‌త్కారాలు కూడా చేసాడు ప‌వ‌ర్ స్టార్. ఆజ్ కా గూండారాజ్ చేసిన‌పుడే ర‌వితేజ‌ను చూసాన‌ని.. ఆ త‌ర్వాత ఎంతో క‌ష్ట‌ప‌డి స్టార్ అయ్యాడ‌ని.. అత‌డి ఈ హోదా వెన‌క ఎంతో కృషి, ప‌ట్టుద‌ల ఉన్నాయ‌ని గుర్తు చేసాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి నేల‌టికెట్ ఆడియోలో ప‌వ‌ర్ స్టార్ మాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. 

More Related Stories