English   

హరి హర వీరమల్లుగా పవన్..లుక్ అదిరిందిగా

Hari Hara Veera Mallu
2021-03-11 17:58:00

పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ళ తరవాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఇక రీఎంట్రీ తరవాత ఇదివరకంటే వేగంగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. పవన్ నటించిన వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఇదిలా ఉండగానే క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇక తాజాగా ఈ టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే చిత్ర యూనిట్ సినిమా టైటిల్ హరిహారవీరమల్లు గా ప్రకటించింది. ఇక సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో లో పవన్ ఎప్పుడూ లేని విధంగా గాల్లోకి ఎగురుతూ విన్యాసం చేస్తున్నారు. అంతే కాకుండా పవన్ ఓర చూపుతో కత్తి దూస్తూ కనిపిస్తున్న క్లిప్పింగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

More Related Stories