English   

పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు..? ఎందుకు వెళ్లాడు..?

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడీ మాటను మరోలా కూడా అర్థం చేసుకోవచ్చు.. పవర్ కోసం ప్రయత్నిస్తోన్న స్టార్ అని. ఆ పవర్ అతనికి వస్తుందో లేదో తెలియదు కానీ, ఇప్పటికే మరొకరికి పవర్ వచ్చేలా పవన్ ప్రయత్నించాడు. తెచ్చాడు కూడా. కానీ మధ్యలో చెడింది. ఇప్పుడు తను సొంత కుంపటి పెట్టుకుని మళ్లీ పవర్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయాలు కాసేపు పక్కన బెడితే ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన హడావిడీ మాత్రం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికంటే ముందు రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ కూడా కీలకమే. కానీ రాజకీయ నాయకుడుగా చావును సిద్ధపడి వచ్చాననడం నిజంగా ఆశ్చర్యమే. అంటే పాలిటిక్స్ లోకి వచ్చినవాళ్లందిరినీ ఎవరైనా చంపేస్తున్నారా..? అవన్నీ పక్కన బెడితే ఇవాళ ఆయన ఫిల్మ్ చాంబర్ కు రావడం పలు రకాల ఊహాగానాలకు తావిస్తోంది. 

అసలు పవన్ అక్కడికి ఎందుకు వచ్చాడు..? ఏం చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాడు.. ఇవన్నీ ప్రశ్నలే. అయితే మీడియాతో ఇండస్ట్రీకి ఉన్న అనుబంధాన్ని తగ్గించాలి, వారితో పర్సనల్ రాపో మెయిన్టేన్ చేయకూడదు. దీనికి సంబంధించి చాంబర్ కొన్ని విధివిధానాలు రూపొందించాలి.. ప్రతి దానికి మీడియా సమావేశం పెట్టడం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన ఛాంబర్ ఓ పర్ఫెక్ట్ గైడ్ లైన్ ఏర్పాటు చేయాలి. ఇదే పవన్ కళ్యాణ్ చాంబర్ లో సభ్యులతో చర్చించిన అంశాలు అంటూ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మరి వీటిలో నిజాలెంత అనేది తెలియదు కానీ.. 

ఓవైపు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష జరుగుతోంది. దాని గురించి కనీసం ఒక్క ముక్క మాట్లాడకుండా.. ఎన్నడూ రాని చాంబర్ కు రావడం మాత్రం విడ్డూరంగా ఉందంటున్నారు చాలామంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనే విషయం అతనికైనా క్లారిటీ ఉందో లేదో కానీ.. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చెప్పాడనే కాదు.. ప్రతి సామాన్యుడిలోనూ వినిపిస్తోన్న మాట.. వర్మ, శ్రీ రెడ్డితో అనిపించిన మాట బాధిస్తే.. వారే చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్స్ ఇవ్వొచ్చు కదా అని. ఇక ఈ చాంబర్ వ్యవహారంలో ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. పవన్ ఫ్యాన్స్ కొందరు ఓ మీడియా వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం. మరి ఈ గొడవ ఎప్పుడు తేలుతుందో ఏమో చూడాలి. 

More Related Stories