English   

వ‌కీల్ సాబ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇలా ఉండ‌బోతుంద‌ట

 Pawan Kalya
2021-04-03 13:42:36

బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన‌ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మూడేళ్లు గ్యాప్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ఈ సినిమాతో మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌బోతున్నారు. ఇక సినిమాలో శృతి హాస‌న్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జంట‌గా న‌టిస్తోంది. లైంగిక వేధింపులు ఎదుకున్న మ‌హిళల‌ హ‌క్కుల కోసం చేసే పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అన‌న్య, నివేధితా తామ‌స్, అంజ‌లి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ ప‌వ‌ర్ స్టార్ అభిమానులను ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. 

అంతేకాకుండా ట్రైల‌ర్ కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చి యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూవ్స్ వ‌చ్చాయి. ఇక బాలీవుడ్ పింక్ లో అమితాబ్ హీరోగా న‌టించ‌గా సినిమాలో యాక్ష‌న్ సీన్ లు గానీ హీరోయిన్ గానీ ఉండ‌దు. కానీ తెలుగులో ప‌వ‌ర్ స్టార్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప‌లు మార్పులు చేశారు. ప‌వ‌న్ ఇమేజ్ కు త‌గిన‌ట్టుగా రెండు యాక్ష‌న్ సీన్ ల‌ను చిత్రించిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాలో ప‌వ‌న్ కు హీరోయిన్ గా శృతి హాస‌న్ మ‌ధ్య రొమాంటిక్ సీన్ లు కూడా ఉండ‌బోతున్నాయి. ఇదిలా ఉంటే తాజా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ ప్ర‌కారం ఈ సినిమా ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైట్ ఉండ‌బోతుంద‌ట‌. ఇక ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ తోనే థియేట‌ర్ లు మోత మోగిపోవ‌డం ప‌క్కా అని చెప్పొచ్చు. ‌

More Related Stories