English   

పవన్ కళ్యాణ్ మళ్లీ ఓ ఇంటివాడవుతున్నాడు.. 

Pawan-Kalyan
2018-03-12 08:16:03

టైటిల్ చూస్తే చాలా డౌట్స్ వస్తున్నాయి కదూ.. కానీ ఇది నిజం. పవన్ కళ్యాణ్ మళ్లీ ఓ ఇంటివాడవుతున్నాడు. ఇప్పటికే అతను.. ఆగండాగండి.. అతనేమీ మళ్లీ మీరు ఊహించుకుంటోన్న దానికి సిద్ధం కావడం లేదు. కొత్తగా మళ్లీ ఓ ఇల్లు కట్టుకుంటున్నాడు. యస్.. ఇప్పుడున్న ఇల్లు కాకుండా ఓ కొత్త ఇల్లు కట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజకీయనేత కూడా కాబట్టి అందుకు అనుగుణంగా ఉండేలా కొత్త ఇల్లు నిర్మించుకోబోతున్నాడు పవన్. ఈ నూతన గృహానికి రేపు భూమి పూజ చేయబోతున్నారు.  సినిమాలు చేయడం లేదు కానీ అంతకంటే బిజీ అయిపోయాడు పవన్. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో పనిచేయడం ఇప్పుడే. ఇన్ని రోజులు పార్టీ కోసం ఆయన ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేయలేదు. త్వరలోనే ఎన్నికలున్న నేపథ్యంలో పొలిటికల్ గా యాక్టివ్ కావడమే కాదు.. తగినంత స్వరం పెంచడానికీ.. అవసరమైన హోమ్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే జె.ఎఫ్.ఎఫ్.సి(జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ) స్థాపించిన పవన్.. త్వరలోనే స్వరం పెంచబోతున్నాడు. ఆ విషయం ఈ నెల 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభలో చూపించబోతున్నాడు. ఈ సభను తన పూర్తి స్ట్రెంత్ చూపించేలా ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ఆవిర్భావ సభను గుంటూరులో ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ సభలో అభిమానులే ఉంటారా.. లేక కార్యకర్తలు కూడా ఉంటారా అనేది చూడాలి. కానీ ఈ లోగా కొత్త ఇంటికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.. 

More Related Stories