English   

పవన్ కళ్యాణ్ సినిమాలో రామ్ చరణ్ కీలక రోల్ 

pawan kalyan
2020-07-03 17:23:24

తెలుగు సినిమా తన జానర్ మార్చుకుంటోంది. ఇప్పటిదాకా ఎక్కువగా లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు తీసి తీసి అలసిన మన మేకర్స్ ఇప్పుడు రాజుల కాలంలోకి వెళ్తున్నారు. భారీ ఖర్చుతో పీరియాడికల్ డ్రామాలు తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మాస్ కి కేరాఫ్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్‌ ఇపుడు ఫస్ట్ టైమ్‌ పీరియాడికల్‌ మూవీ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో బ్రిటీష్ కాలంనాటి కథలో రాబిన్ హుడ్ లాంటి దొంగ పాత్రలో నటిస్తున్నాడు పవన్. ఎక్కువగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేసే క్రిష్‌, పవన్‌ కళ్యాణ్‌ తో రాబిన్‌హుడ్‌ తరహా సినిమా తీస్తున్నాడు. స్వాతంత్ర్యానికి పూర్వంనాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరిస్తున్నారు. ఇక జానపద 'బాహుబలి'తో ఇండియన్‌ ఆడియన్స్‌ని మాహిష్మతి సామ్రాజ్యంలోకి తీసుకెళ్లిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో మన్యం వీరులని చూపించబోతున్నాడు. 

ఇదీ పీరియాడిక్ డ్రామానే. 'ట్రిపుల్‌ ఆర్'లో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తోంటే, తారక్‌ కొమరం భీమ్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా తిరుగుతోంది. అదేంటంటే బాబాయ్ సినిమాలో అబ్బాయ్ నటించనున్నాడని అంటున్నారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్కేక సెట్లో ఈ సినిమా షూట్ జరగాల్సి ఉంది. ఈ సినిమాలోనే ఒక కీలక పాత్రలో చరణ్ నటించవచ్చని వార్తలు బయటకొచ్చాయి. చరణ్‌ ఇప్పటికే తన తండ్రి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో వైపు బాబాయి పవన్ సినిమాలో కూడా అతిథి పాత్రలో చేయనున్నాడనే వార్త బయటకు పొక్కడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories