English   

పింక్ రీమేక్ షూటింగ్ మొదలు.. పవన్ వచ్చేసాడండహో..

Pawan Kalyan
2020-01-20 16:04:42

చాలా రోజులుగా పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్ కల్యాణ్ మళ్లీ మొహానికి రంగేసుకున్నాడు. ఈయన నటిస్తున్న పింక్ సినిమా రీమేక్ షూటింగ్ మొదలైంది. జనవరి 20న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పవన్ కల్యాణ్ కూడా షూటింగ్ కు రావడం విశేషం. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. వీలైనంత ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. నిర్మాత దిల్ రాజు కూడా నిర్మాణ బాధ్యతలు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు.  

20 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న ఆయనకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం వచ్చింది. జనవరి 20 నుంచి 31 వరకు షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. తొలి షెడ్యూల్లోనే పవన్ పాల్గొనడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న వాళ్లకు ఇప్పుడు పింక్ రీమేక్ పట్టాలెక్కడంతో హ్యాపీగా కనిపిస్తున్నారు అభిమానులు. 

తెలుగులో లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కేవలం 45 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. 2020 మేలో సినిమాను విడుదల చేయనున్నారు. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తే బాగుంటుందని.. ముఖ్యంగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఈ సినిమాలో చూపించారు కాబట్టి.. ఒక సామాజిక బాధ్యత ఉన్న హీరో నటిస్తే ప్రేక్షకులకు మరింతగా రీచ్ అవుతుందని పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు నిర్మాత బోనీకపూర్. 

అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలో నటించిన పింక్ బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాను తమిళనాట అజిత్ హీరోగా నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో ఇప్పుడు తెలుగులో సినిమా పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తున్నారు.

More Related Stories