English   

పవన్, మహేష్ ఆ సినిమా కానీ చేసుంటేనా..

Pawan Kalyan Mahesh
2020-03-30 12:51:57

తెలుగు ఇండస్ట్రీలో ఇఫ్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ బాగానే నడుస్తుంది. అందుకే దర్శకులు కూడా ధైర్యంగా కథలు రాస్తున్నారు. ఇగో పక్కనబెట్టి ఓకే అంటున్నారు కాబట్టే కొత్త కథలు కూడా వస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు పవన్, మహేష్ బాబు లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ ను ఒకే సినిమాలో చూపించాలని దర్శకుడు ఇంద్రగంటి కూడా అనుకున్నాడు. కానీ అది కుదర్లేదు. ఈయన తను రాసుకున్న వి సినిమా కోసం ముందు పవన్, మహేష్ బాబులను తీసుకోవాలనుకున్నాడు. ఈ సినిమా కథ అంత పవర్ ఫుల్ గా ఉంటుందని.. అలాంటి ఇద్దరు హీరోలు అయితే పక్కాగా న్యాయం చేస్తారని ముందు అనుకున్నాడు ఈయన. అయితే అలాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒప్పించడం చిన్న విషయం కాదు.. కనీసం కథ కూడా వినిపించలేకపోయాడు ఈయన. 

ఇప్పుడు ఇదే కథను వి పేరుతో నాని, సుధీర్ బాబుతో తెరకెక్కించాడు ఈయన. కరోనా కానీ కాటు వేయకుండా ఉండుంటే ఈ పాటికి సినిమా విడుదలై ఐదు రోజులు కూడా అయ్యుండేది. ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. నాని విలన్ గా నటించగా.. సుధీర్ బాబు హీరోగా కనిపించాడు. నివేదా థామస్ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ముందు పవన్, మహేష్ బాబు లాంటి స్టార్స్ ను అనుకోవడం.. దిల్ రాజు అదంత సులభం కాదని తేల్చేయడంతో నాని వైపు వెళ్లాడు దర్శకుడు. న్యాచురల్ స్టార్ కు ఇది 25వ సినిమా కావడం విశేషం. ఎప్రిల్ లో సినిమా విడుదల కానుంది. ఒకవేళ అన్నీ కుదిరి ఈ సినిమా కానీ మహేష్, పవన్ చేసుంటే ఎవరు విలన్ గా ఉండేవారో.. ఎవరు హీరోగా చేసుండేవారో..? 

More Related Stories