English   

ప‌వ‌న్ తో క‌మిట్మెంటే అత‌డికి శాప‌మా..? 

Pawan-Kalyan-srinivas
2018-03-12 11:29:40

ఒక‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. కానీ ఇప్పుడు కాదు. ఆయ‌న సినిమాకు క‌మిటైతే చుక్కానీ లేని నావ ప‌ట్టుకుని న‌డి సంద్రంలో ఈదుతూ వెళ్ళిన‌ట్లే. ఎందుకంటే ఎప్పుడు చేస్తాడో తెలియ‌దు.. అస‌లు చేస్తాడో లేదో కూడా తెలియ‌దు. అలా ఉంది ఇప్పుడు ప‌వ‌న్ ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు త‌ల‌కు మించిన భార‌మే. ఈయ‌న‌తో సినిమాకు క‌మిటైతే ఇక ఆ ద‌ర్శ‌కుల కెరీర్ ఇంక‌ అంతేనా అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది. ఒక‌ప్పుడు సంప‌త్ నంది ప‌రిస్థితి అంతే.. ఆ త‌ర్వాత ఆర్టీ నీస‌న్.. ఇప్పుడు సంతోష్ శ్రీ‌నివాస్ ప‌రిస్థితి అంతే..! ఏం జ‌రుగుతుంది అస‌లు.. ఇదే తెలియ‌క పాపం ఈ ద‌ర్శ‌కులు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా అంటే ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులు ఎగిరి గంతేసేవాళ్లు కానీ ఇప్పుడు వ‌ద్దు బాబోయ్ అంటున్నారు. 

అప్పుడెప్పుడో నీస‌న్ తో సినిమా అన్నాడు. మొద‌లుపెట్టాడు కూడా.. వేదాళం రీమేక్ అన్నాడు.. ఏఎం ర‌త్నంకు డేట్స్ కూడా ఇచ్చాన‌ని చెప్పాడు కానీ చివ‌రికి ఏమైంది.. ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కింది. అప్ప‌ట్లో గ‌బ్బ‌ర్ సింగ్ 2 అంటూ సంపత్ నందిని కూడా ఇదే చేసాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్పుడు సంతోష్ శ్రీ‌నివాస్. హైప‌ర్ వ‌చ్చి ఏడాదిన్న‌ర అవుతున్నా ఇప్ప‌టికీ మ‌రో సినిమా మొద‌లుపెట్ట‌లేదు సంతోష్. దానికి కార‌ణం ప‌వ‌న్ తో ఈయ‌న‌కు ఉన్న క‌మిట్ మెంట్. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్. మైత్రి మూవీ మేక‌ర్స్ తో ప‌వ‌న్ చేయాల్సిన సినిమా సంతోష్ శ్రీ‌నివాస్ తోనే. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఆగిపోయింది. ఇప్ప‌ట్లో త‌న‌కు సినిమాలు చేసే ఉద్దేశ్య‌మే లేద‌ని తెగేసి చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. దాంతో సంతోష్ ఏడాది న్న‌ర ఎదురుచూపులు బూడిద‌లో పోసిన ప‌న్నీరైపోయాయి. మొత్తానికి ప‌వ‌న్ తో క‌మిట్ మెంటే ఇత‌డికి శాపంగా మారిందిప్పుడు. మ‌రిప్పుడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చే ఆ హీరో ఎవ‌రో..?

More Related Stories